Tirumala: తిరుమలలో మహిళలు పూలు పెట్టుకోకూడదు..? ఎందుకో తెలుసా..?

ఏడుకొండలపైన కొలువైన కలియుగ శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం.. భక్తులు తరలివస్తుంటారు. అయితే తిరుమల కొండపైన పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. కొండపైన పుష్పాలంకర నిషిద్ధమని మీకు తెల్సా..?

Tirumala: తిరుమలలో మహిళలు పూలు పెట్టుకోకూడదు..? ఎందుకో తెలుసా..?
Women
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 13, 2024 | 5:06 PM

 కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. దేవ దేవుని లిప్తపాటు దర్శనం కోసం.. ఏడుకొండలకు నిత్యం భక్త కోటి తరలివచ్చి తరిస్తారు. అయితే తిరుమల కొండపైకి వెళ్లిన భక్తులు పలు నియమాల్ని పాటించాల్సి ఉంటుంది. అందులో ఒకటి ఏంటంటే.. మహిళలు పూలు పెట్టుకోకూడదు. అవును నిజమే… కొండపై భక్తుల పుష్పాలంకరణ నిషిద్ధం. దీనికి గల కారణమేంటో తెలుసుకుందాం పదండి….

కొండపై కుసుమాలన్నీ వెంకన్నకే : శ్రీవారు అలంకార ప్రియుడన్న విషయం విధితమే కదా. అందుకే కొండపై పూసిన పుష్పాలు..  ఆ వెంకటేశ్వరుడికే చెందాలనేది భక్తుల విశ్వాసం. అందుకే కొండపైన ఎవరూ పూలు పెట్టుకోరు. అయితే దీనికి పూరాణాల్లో మరో కథ ప్రచారం ఉంది. ప్రాచీనకాలంలో వెంకన్నకు అలంకరించిన పువ్వులను భక్తులకు ఇచ్చే వారు. వారు ఆ పుష్పాలను పరమ పవిత్రమైనవిగా భావించి.. భక్తిశ్రద్ధలతో వాటిని తీసుకుని ఆడవాళ్లయితే తలలో, మగవాళ్లు చెవిలో పెట్టుకునేవారు.

అయితే ఒకసారి శ్రీశైలపూర్ణుడు అనే ఓ పూజారి శిష్యుడు వెంకటేశ్వరస్వామి అలంకరణకు ఉపయోగించాల్సిన పువ్వులను తాను అలంకరించుకున్నాడట. ఇక ఆ రాత్రి శ్రీనివాసుడు.. ఆ పూజారి కలలో కనిపించి నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడని కన్నెర్ర చేశాడట. ఆ తదుపురి శ్రీశైలపూర్ణుడు ఎంతగానో మదనపడ్డాడు. అదిగో అప్పటి నుంచి… కొండపైన ఉన్న పుష్ప సంపద అంతా వెంకన్నకే చెందాలనే నియమం మొదలైంది. అంతే కాదు.. స్వామికి అలంకరించిన పూవులను సైతం.. భక్తులకు ఇవ్వకుండా పూలబావిలో వేసే ఆచారం షురూ అయింది.

Also Read: చేపల కోసం వల వేసిన జాలర్లు.. అందులో చిక్కింది చూసి స్టన్

గుడికి ఎలా వెళ్లాలంటే.. : అలంకార ప్రియుడైన శ్రీనివాసుడు ముందు భక్తుల అలంకరణలు ఏపాటివి చెప్పండి. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం ముందు భక్తులు సాధారణంగా కనిపించాలని గుర్తు చేసేందుకే పూలు పెట్టుకోకూడదన్న ఆనవాయితీ అమల్లోకి వచ్చింది. అంతే కాదు దేవాలయాలకు వెళ్లేటప్పుడు…. ఆడంబరాలకు పోకుండా… ఏకాగ్రతతో దర్శనానికి వెళ్తే  మంచిదని ఆచార్యులు, వేద పండితులు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం  తిరుమలలో పూలబావిలో వేసిన పువ్వులతో… అగరువత్తులు తయారు చేస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..