Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nellore: చేపల కోసం వల వేసిన జాలర్లు.. అందులో చిక్కింది చూసి స్టన్

అమ్మా గంగమ్మ తల్లి.. మా వలలో మంచి చేపలు పడి.. మరిన్ని కాసులు వచ్చేలా చూడు అని మొక్కి సముద్రంలోకి వెళ్తారు జాలర్లు.. వారి ప్రార్థనలు కొన్నిసార్లు ఫలిస్తాయి.. మరికొన్నిసార్లు.. సీన్ రివర్స్ అవుతుంది. తాజాగా అలాంటి ఘటనే జరిగింది...

Nellore: చేపల కోసం వల వేసిన జాలర్లు.. అందులో చిక్కింది చూసి స్టన్
Projectile
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 13, 2024 | 2:31 PM

వల వేసేముందు ప్రతిసారి జాలర్లు గంగమ్మకు మొక్కుముంటారు. దండిగా చేపలు పడాలని.. అరుదైన చేపలు చిక్కి కాసులు పంట పండాలని ఆశపడుతుంటారు. ఫేట్ బాగుంటే.. వారు అనుకున్నట్లే జరుగుతుంది. కానీ ఒక్కోసారి సీన్ రివర్స్ అయి.. అసలుకే మోసం వస్తుంది. నెల్లూరు సమీపంలో 100 కిలోల బరువున్న రాకెట్ శకలం చైన్నై జాలర్ల వలకు చిక్కింది. దాన్ని కష్టం మీద ఒడ్డుకు చేర్చారు.  కాసిమేడు మత్స్యకార సంఘం వారు ఈ వార్తను వెంటనే పోలీసులకు చేరవేశారు. ఆ వస్తువు ఓ ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీకి చెందినదనే అనుమానంతో తదుపరి పరిశీలన నిమిత్తం పోలీసులకు అప్పగించారు.

గత నెలలో డ్రైవర్ వెంకట్రామన్ నేతృత్వంలో మత్స్యకారుల బృందం బోటులో సముద్రంలోకి వెళ్లింది. చేపలు పట్టేందుకు నెల్లూరు సమీపంలోని నిజాంపట్టణం వరకు వారు చేరుకున్నారు. అక్కడ చేపలు బాగా చిక్కుతాయని భావించి వల వేశారు. వల బరువు అసాధారణంగా అనిపించడంతో.. మస్త్ చేపలు చిక్కాయని ఆశపడ్డారు. పైకి లాగి చూడగా.. వలలో కనిపించింది చూసి బిత్తరపోయారు.  అది దాదాపు 100 కిలోల బరువున్న రాకెట్ శకలం. దాన్ని ఒడ్డుకు తీసుకొచ్చేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది. ఆ రాకెట్ శకలం కారణంగా తమ  వలలు దెబ్బతిన్నాయని, మరమ్మతులకు కనీసం 30,000 ఖర్చు అవుతుందని జాలరి దినేష్‌కుమార్‌ తెలిపారు. మత్స్యకారులు దానిని తిరిగి కాసిమేడుకు తీసుకొచ్చారు. పోలీసులు, మత్స్యశాఖ అధికారులు వెళ్లి.. ఆ వస్తువును పరిశీలించారు.

“దానిపై బార్నాకిల్స్ ఉన్నాయి, ఇది సముద్రంలో దాదాపు మూడు నెలలు క్రితం పడి ఉండవచ్చని తెలుస్తోంది. దానిపై గుర్తులు, సంఖ్యలు ఉన్నాయి, ఇది ప్రైవేట్ డిఫెన్స్  లేదా ఏరోస్పేస్ సంస్థకు చెందినదని సూచిస్తుంది. మేము దానిని ఫిషింగ్ హార్బర్ పోలీసులకు అప్పగించాము.” అని మత్స్యశాఖ అధికారి ఒకరు తెలిపారు.

ఫిషింగ్ హార్బర్ స్టేషన్‌కు చెందిన ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ.. టెస్టింగ్ సమయంలో  ఈ రాకెట్ శకలం సముద్రంలో పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో మెరైన్ పోలీసులు, నేవీ, కోస్ట్ గార్డులను అప్రమత్తం చేశారు. “నావికాదళం నుండి కొంతమంది అధికారులు దీనిని తనిఖీ చేయడానికి వచ్చారు, కానీ అది వారిది కాదని వారు ధృవీకరించారు” అని పోలీసులు తెలిపారు. ఆ రాకెట్ శకలంలో గైడెన్స్ వ్యవస్థ, ట్రిగ్గరింగ్ మెకానిజం, ఫ్యూజ్‌లు…  ఘన లేదా ద్రవ ఇంధనం లేవని అధికారులు నిర్ధారించారు. దాని ఖచ్చితమైన స్వభావాన్ని గుర్తించడానికి సమగ్ర విచారణ అవసరమని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..