Farmers Tractor Rally: రెడ్ ఫోర్ట్ చేరిన రైతులు, పోలీసులపై ట్రాక్టర్ నడిపించడానికి యత్నం, బస్సులపై రాళ్లు

ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ అత్యంత బీభత్సంగా మారింది.  పెద్ద సంఖ్యలో రెడ్ ఫోర్ట్ చేరుకున్న వీరు కనీవినీ ఎరుగని ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు.

Farmers Tractor Rally: రెడ్ ఫోర్ట్ చేరిన రైతులు, పోలీసులపై ట్రాక్టర్ నడిపించడానికి యత్నం, బస్సులపై రాళ్లు
Follow us
Umakanth Rao

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 26, 2021 | 3:15 PM

Farmers Tractor Rally: ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ అత్యంత బీభత్సంగా మారింది.  పెద్ద సంఖ్యలో రెడ్ ఫోర్ట్ చేరుకున్న వీరు కనీవినీ ఎరుగని ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. సెంట్రల్ ఢిల్లీలో ఓ రైతు పోలీసులపైకి ట్రాక్టర్ నడిపించడానికి యత్నించడంతో ఖాకీలు చెల్లా చెదరయ్యారు. ఇదే చోట బస్సులపై వారు రాళ్ళూ రువ్వారు. ఖాకీలపైకి పొడవాటి కత్తులను ఝళిపించారు. వీరి దాడుల్లో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఢిల్లీలో పోలీసులు  పలు రోడ్లను మూసివేశారు.

‘రంగ్ దే బసంతి’, ‘జై జవాన్, జై కిసాన్’ అని నినాదాలు చేస్తూ లక్షలాది రైతులు..ట్రాక్టర్లు, బైకులు, చివరకు గుర్రాలపై కూడా వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీ చేరుకున్నారు. కొందరు క్రేన్లను కూడా నగరంలోకి తెచ్చారు. స్థానికుల్లో పలువురు రోడ్లకు రెండు వైపులా నిలబడి పూల రేకులు చూపుతూ, డ్రమ్స్ వాయిస్తూ వారికి స్వాగతం తెలిపారు. పతాకాలతో నిండిన వాహనాలపై నిలబడి అన్నదాతల్లో కొంతమంది..’సారే జహాసే అచ్చా’ వంటి దేశభక్తి గీతాలు పాడుతూ డ్యాన్సులు చేశారు. మొత్తానికి  ఉదయం ప్రశాంతంగా ఉన్న నగరం కొద్దిసేపటికే అత్యంత ఉద్రిక్తంగా మారిపోయింది. రిపబ్లిక్ దినోత్సవ పరేడ్ సజావుగా సాగినప్పటికీ ఆ తరువాత రైతుల ట్రాక్టర్ ర్యాలీ ఈ నగరాన్ని బీభత్సంగా మార్చింది.

Read Also:ఢిల్లీ బోర్డర్ చేరిన వేలాది రైతులు, రామ్ లీలా మైదాన్ వెళ్లేందుకు యత్నం, పోలీసులతో ఘర్షణ.