Casual Racism : ఒకే చోట ఉన్నా.. రెండు పద్ధతులు..! ఆస్ట్రేలియాలో మా క్వారంటైన్ ఎలా సాగిందంటే..!

ఆస్ట్రేలియాలో క్వారంటైన్‌ ఆంక్షలు కఠినంగానే కాక.. విచిత్రంగానూ అనిపించాయని టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు. ఇరు జట్లు ఒకే బయో బబుల్‌లో ఉన్నప్పటికీ..

Casual Racism : ఒకే చోట ఉన్నా.. రెండు పద్ధతులు..! ఆస్ట్రేలియాలో మా క్వారంటైన్ ఎలా సాగిందంటే..!
Follow us

|

Updated on: Jan 26, 2021 | 3:17 PM

Casual Racism : ఆస్ట్రేలియాలో క్వారంటైన్‌ ఆంక్షలు కఠినంగానే కాక.. విచిత్రంగానూ అనిపించాయని టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు. ఇరు జట్లు ఒకే బయో బబుల్‌లో ఉన్నప్పటికీ.. ఆసీస్ ప్లేయర్లున్న లిఫ్ట్‌లోనికి తమను ఎక్కనివ్వలేదని పేర్కొన్నాడు. అది చాలా బాధగా అనిపించిందని అశ్విన్ ​ వెల్లడించాడు.

కోవిడ్ వైరస్‌ వల్ల ఆసీస్‌ పర్యటన మొత్తం టీమిండియా ఆటగాళ్లు ఆంక్షల్లో ఉండాల్సి వచ్చిందని తెలిపాడు. బయో బుడగలో ఉన్నప్పటికీ సిడ్నీ, మెల్‌బోర్న్‌, బ్రిస్బేన్​ల‌లో వేర్వేరు నిబంధనలు పాటించాల్సి వచ్చిందని తెలిపాడు. అక్కడి సాధారణ పౌరుల కన్నా కఠినంగా భారత ఆటగాళ్లకు నిబంధనలు విధించారని అన్నాడు.

ఆస్ట్రేలియా‌లో అడుగుపెట్టిన వెంటనే కఠిన క్వారంటైన్‌లో తాము ఉన్నామని అన్నాడు. అయితే బ్రిస్బేన్‌ వెళ్లిన తర్వాత మళ్లీ క్వారంటైన్‌ ఉండాలని ఆదేశించారని… బీసీసీఐ కల్పించుకోవడంతో కొన్నింటిని మినహాయించారని అశ్విన్ వెల్లడించాడు. చిత్రవిచిత్రమైన కరోనా రూల్స్ పేరుతో విధించడమే కాకుండా భారత ఆటగాళ్లు నిబంధనలు పాటించేందుకు ఇష్టపడటం లేదన్నట్టుగా అక్కడి మీడియా దుష్ప్రచారానికి పాల్పడ్డ విషయాన్ని గుర్తు చేశారు. తన ఆసీస్ అనుభావాలను ఇలా పంచుకున్నాడు.

మేం సిడ్నీకి చేరుకోగానే మమ్మల్ని కఠిన ఆంక్షల మధ్య బంధించారు. పైగా అక్కడే ఒక ప్రత్యేకమైన సంఘటన చోటు చేసుకుంది. నిజం చెప్పాలంటే చాలా వింతగా అనిపించింది. భారత్‌, ఆసీస్‌ ఆటగాళ్లు ఒకే బయో బుడగలో ఉన్నారు. ఆసీస్‌ ఆటగాళ్లు ఒక లిప్ట్‌లో ఉండగా అందులోకి మమ్మల్ని అనుమతించలేదు అని ఈ ఆఫ్ స్పిన్నర్​ఆవేదన వ్యక్తం చేశాడు.

గాయ్స్‌.. ఆ సమయంలో చాలా బాధపడ్డాం. మేమంతా ఒకే బయో బుడగలో ఉన్నాం. కాని వారు ఉన్న లిప్టులోకి మమ్మల్ని అనుమతించలేదు. వారితో కలిసి ఆ చోటును పంచుకోవడానికి నిరాకరించారు. దీనిని జీర్ణించుకోవడానికి ఇబ్బంది పడ్డాం. ఒకే బుడగలో ఉన్నప్పుడు ఒకే లిప్ట్‌లో వెళ్తే మాత్రం తప్పేంటి?’ అని యాష్‌ ప్రశ్నించాడు.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..