లైవ్ అప్‌డేట్స్: ప్రచంఢ సైక్లోన్‌గా ఫొని..

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫొని తుఫాన్. గంటకు 11 కి.మీ. వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తుంది. ఒడిశాలోని గోపాలపురానికి 70 కిలో మీటర్లు, ఏపీలోని ఇచ్ఛాపురానికి 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ రోజు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య.. ఒడిశా తీరం గోపాల్‌పూర్, చాంద్‌బలి మధ్య తీరం దాటే అవకాశం. 170-180 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని అంచనా. తీరాన్ని దాటిన తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా […]

లైవ్ అప్‌డేట్స్:  ప్రచంఢ సైక్లోన్‌గా ఫొని..
Follow us

| Edited By:

Updated on: May 03, 2019 | 12:10 PM

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫొని తుఫాన్. గంటకు 11 కి.మీ. వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తుంది. ఒడిశాలోని గోపాలపురానికి 70 కిలో మీటర్లు, ఏపీలోని ఇచ్ఛాపురానికి 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ రోజు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య.. ఒడిశా తీరం గోపాల్‌పూర్, చాంద్‌బలి మధ్య తీరం దాటే అవకాశం. 170-180 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని అంచనా. తీరాన్ని దాటిన తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించి క్రమంగా బలహీనపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం. గంటలకు 90-100 కిలో మీటర్ల వేగంతో బెంగాల్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ అంటుంది. క్రమంగా బలహీనపడుతూ బంగ్లాదేశ్ మీదుగా అసోంలోకి ప్రవేశించి అల్పపీడనంగా మారనున్న ఫొని సైక్లోన్.

1999లో జరిగిన బీభత్సమే ఇప్పుడు జరగబోతోందంటోంది వాతావరణ శాఖ. అప్పటి తుఫాన్ బీభత్సానికి దాదాపు 10వేల మంది మృత్యువాత పడ్డారు. వేల కోట్ల ఆస్తినష్టం సంభవించింది. దాని ప్రభావం నుంచి కోలుకునేందుకు ఏళ్లు పట్టింది. ఇప్పుడు ఫొని తుఫాన్ కూడా అంతకు మించి ఉంటుందనే అంచనాకొస్తున్నారు అధికారులు. అంతటి ప్రభావం ఉంటుంది కాబట్టే ఈ తుఫాన్‌కు ఫొని అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది.

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం దగ్గర కదులుతున్న ఫొని తుఫాన్. ఇచ్చాపురానికి 60 కిలో మీటర్ల దూరంలో పయనిస్తున్న తుఫాన్. ఒడిశాలోని పూరీకి దక్షిణ దిశగా తీరం దాటే అవకాశం. ఇంకా ప్రచంఢ తుఫాన్‌గా మారే అవకాశముందని ఆర్టీజీఎస్ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే అన్ని తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. భీమిలీ, కళింగ పట్నం పోర్టుల్లో పదో నెంబర్, విశాఖ, గంగవరం పోర్టుల్లో 8వ నెంబర్, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, కాకినాడ, వాడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో అల్లకల్లోలంగా సముద్రం. తుఫాన్ దాటే సమయంలో 100-190 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా.. ఇప్పటికే పలు రైల్వే సర్వీసులు, విమాన సర్వీసులు రద్దు చేశారు.

ఫొని ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో 11 మండలాలు, విజయనగరంలో 5 మండలాలు ప్రభావితం అయ్యే అవకాశముందన్నారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం. ఫొని తుఫానుపై ఢిల్లీ నుంచి కేంద్ర కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా మినహా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారత వాతావరణ శాఖ రియల్ టైం గవర్నెన్స్ నుంచి వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించి అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు ఏపీ సీఎస్.

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలెవరూ ధైర్యాన్ని కోల్పోవద్దంటూ ట్వీట్ చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని కాంగ్రెస్ కార్యకర్తలు బాధితులకు అండగా ఉండాలని సూచించారు. అందరూ క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.

ఒడిశాలో ఫొని తీరం దాటింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో తీవ్ర గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఈ ఉదయం 8గంటల సమయంలో ఫొని ప్రభావం ఎక్కువైందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా పూరీలో ఫొని ఉగ్రరూపానికి సంబంధించిన ఓ వీడియోను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారులు విడుదల చేశారు. అందులో భీకర శబ్దాలు, గాలులతో ఫొని అందరిలో భయాన్ని కలిగిస్తోంది. ఇదిలా ఉంటే చాలా ప్రదేశాల్లో 150 నుంచి 175కి.మీల వేగంతో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని, భువనేశ్వర్ సహా మరికొన్ని ప్రదేశాల్లో వేళ్లతో సహా చెట్లు కూలబడ్డాయని, ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదని వారు పేర్కొన్నారు.

ఒడిశా: పూరీలో తీరాన్ని తాకి…మూడు గంటలుగా తీవ్ర ప్రభావం చూపింది ప్రచండ ‘పోని’ తుపాన్. భారీ స్థాయిలో నష్టాన్ని కలగజేసింది. మధ్యాహ్నం నుంచీ బలహీన పడనున్న తుఫాను… శనివారం సాయంత్రానికి పూర్తిగా బలహీన పడుతుందని అధికారులు తెలిపారు. భువనేశ్వర్ నుంచీ తుఫాను దిశ మార్చుకొని… తిరిగి సముద్రంలోకి వెళ్లి… బెంగాల్‌లో తీరం దాటనుంది. దీని ప్రభావంతో బెంగాల్‌లో భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే మణిపూర్, నాగాలాండ్‌లో కూడా వర్షాలు కురుస్తాయని అధికారులు తాజాగా అంచనా వేశారు. ప్రస్తుతం భువనేశ్వర్‌పై ప్రభావం చూపిస్తున్న తుఫాను… అక్కడ భారీ వర్షాలు కురిసేలా చేస్తోంది.

అధికారులు అంచనా వేసినట్టే ‘ఫొని’ తుఫాను పూరీలో తీరం దాటింది… ప్రస్తుతం ఒడిశా తీర ప్రాంతాల పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. అధికారులు ఇప్పటికే ప్రమాద సూచినలు ఉన్న ప్రాంతాల్లోని సుమారు  11 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గంజాంలో 3 లక్షల మందినీ, పూరీలో లక్షా 30 వేల మందిని సేఫ్ షెల్టర్లలోకి తరలించారు. బాధితుల కోసం 5,000 షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 5,000 కిచెన్లు ఏర్పాటు చేసి వంటలు వండుతున్నారు. ఒడిశాలో మొత్తం 50 నగరాలు, 10,000 గ్రామాలపై ఫొణి తుఫాను ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.  ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయం… #OdishaPrepared4Fani పేరుతో హ్యాట్ ట్యాగ్ క్రియేట్ చేసి… ట్విట్టర్‌ ద్వారా తుఫాను బాధితులతో టచ్‌లో ఉంటోంది.

ఫొని తుఫాను ప్రభావంపై ఆరా తీసిన గవర్నర్ నరసింహాన్. ఏపీ సీఎం చంద్రబాబు, సీఎస్ సుబ్రమణ్యంతో ఫోన్లో మాట్లాడని గవర్నర్. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వాతవరణ పరిస్థితులు, సహాయ కార్యక్రమాలపై మాట్లడిన గవర్నర్. ఫొని తుఫాను సహాయ, పునరావాస ఏర్పాట్లపై గవర్నర్‌కు వివరించిన సీఎస్.

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..
ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు
తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు
ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..
ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
మానవత్వం చాటుకున్న ఏఎస్‌ఐ... ఏం చేశారంటే ??
మానవత్వం చాటుకున్న ఏఎస్‌ఐ... ఏం చేశారంటే ??