AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సోనూకు భారతరత్న ఇవ్వండి’.. ప్రధానికి ఓ నెటిజన్ వినతి.!

సోనూసూద్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న'ను అందుకునేందుకు సోనూకు అన్ని అర్హతలు ఉన్నాయని..

'సోనూకు భారతరత్న ఇవ్వండి'.. ప్రధానికి ఓ నెటిజన్ వినతి.!
Ravi Kiran
|

Updated on: Oct 13, 2020 | 11:42 AM

Share

Sonu Sood Bharat Ratna: ఎక్క‌డ ఆప‌ద ఉన్నా క్ష‌ణాల్లో సాయం చేసేందుకు ముందు వస్తున్నాడు. కష్టం అనే మాట వినిపిస్తే చాలు వెంటనే స్పందిస్తున్నాడు. లాక్‌డౌన్‌ మొదలైన నాటి నుంచి ఎందరికో సాయం చేసి.. ఇప్పటికీ చేస్తూ రీల్ విలన్‌ నుంచి యావత్ భారతదేశానికి రియల్‌ హీరోగా మారిపోయాడు నటుడు సోనూసూద్. కరోనా విపత్తు సమయంలో ఆయన సాయం వెలకట్టలేనిది.

ఈ నేపథ్యంలో సోనూసూద్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను అందుకునేందుకు సోనూకు అన్ని అర్హతలు ఉన్నాయని.. వలస కార్మికులు, స్టూడెంట్స్, పేదవాళ్లు.. ఇలా ఎంతోమందికి ఏమి ఆశించకుండా విపత్కర పరిస్థితుల్లో ఆయన సేవ చేశాడని చెబుతున్నారు. తాజాగా ఓ నెటిజన్.. ”దేవుళ్ల ఫోటోలకు పక్కనే ఉన్న సోనూసూద్ ఫోటో ఒకటి ట్విట్టర్‌లో పోస్ట్ చేసి సోనూసూద్‌కు భారతరత్న ఇవ్వాలంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశాడు.

‘కోవిడ్ సంక్షోభంలో సోనూసూద్ వలస కార్మికులకు, పేదలకు, విద్యార్థులకు ఎంతో సహాయం చేశారు. దేశానికి నిజమైన హీరో సోనూసూద్‌ను భారతరత్నతో గౌరవించాలని భారతీయులుగా మిమ్మల్ని కోరుతున్నాం” అని మోదీకి ట్వీట్ చేశాడు. ఇక ఆ ట్వీట్‌కు చేతులు జోడించి నమస్కారం పెట్టే ఎమోజీతో నటుడు సోనూసూద్ బదులిచ్చాడు.