హైకోర్టును ఆశ్రయించిన అచ్చెన్నాయుడు

ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తనను అర్థంతరంగా గుంటూరు జనరల్ ఆస్పత్రి నుంచి జైలుకు తరలించారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు.

హైకోర్టును ఆశ్రయించిన అచ్చెన్నాయుడు
Follow us

|

Updated on: Jul 02, 2020 | 4:20 PM

ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తనను అర్థంతరంగా గుంటూరు జనరల్ ఆస్పత్రి నుంచి జైలుకు తరలించారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనని హాస్పిటల్ కి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం రేపు విచారించనున్నట్లు తెలిపింది. అయితే, బుధవారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను విజయవాడ సబ్‌జైలుకు తరలించారు. ఇదిలావుంటే, ఈఎస్‌ఐ స్కామ్‌కేసులో ఏ-2గా ఉన్న అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితులు దృష్ట్యా గుంటూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందించారు. మరోవైపు ఆయనను ఈ నెల 25 నుండి 27 వరకు మూడు రోజులు పాటు కస్టడీకి తీసుకున్న ఎసిబి అధికారులు ఆస్పత్రిలోనే విచారించారు. ఇదిలావుంటే, తనకు కరోనా పరీక్షలు చేయాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ కి లేఖ కూడా రాశారు.