ఈపీఎఫ్‌ఓ గుడ్ న్యూస్.. ఇకపై పీఎఫ్ క్లోజింగ్ డేట్ ఉద్యోగుల చేతుల్లోనే..!

ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి మారినప్పుడు ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలోని డబ్బులను బదిలీ/విత్ డ్రా చేసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో పని చేసిన సంస్థ డేట్ అఫ్ ఎగ్జిట్‌ను ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లో నమోదు చేయకపోవడమే ఇందుకు కారణం. ఇప్పటివరకు ఈ సదుపాయం కేవలం సదరు కంపెనీలకు మాత్రమే ఈపీఎఫ్‌ఓ సంస్థ ఇచ్చింది. దీంతో ఉద్యోగులు తీవ్ర తంటాలు పడేవారు. ఇక అలాంటివారి కోసమే ఈపీఎఫ్‌ఓ సరికొత్త సౌకర్యాన్ని అమలులోకి తెచ్చింది. ఇకపై […]

ఈపీఎఫ్‌ఓ గుడ్ న్యూస్.. ఇకపై పీఎఫ్ క్లోజింగ్ డేట్ ఉద్యోగుల చేతుల్లోనే..!
Follow us

|

Updated on: Jan 23, 2020 | 2:21 PM

ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి మారినప్పుడు ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలోని డబ్బులను బదిలీ/విత్ డ్రా చేసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో పని చేసిన సంస్థ డేట్ అఫ్ ఎగ్జిట్‌ను ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లో నమోదు చేయకపోవడమే ఇందుకు కారణం. ఇప్పటివరకు ఈ సదుపాయం కేవలం సదరు కంపెనీలకు మాత్రమే ఈపీఎఫ్‌ఓ సంస్థ ఇచ్చింది. దీంతో ఉద్యోగులు తీవ్ర తంటాలు పడేవారు. ఇక అలాంటివారి కోసమే ఈపీఎఫ్‌ఓ సరికొత్త సౌకర్యాన్ని అమలులోకి తెచ్చింది. ఇకపై ఉద్యోగులే తమ క్లోజింగ్ డేట్‌ను నమోదు చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.

నమోదు చేసే ప్రక్రియ ఇలా ఉంది..

  1. ముందుగా యూఏఎన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వాలి.
  2. ఆ తర్వాత ‘మేనేజ్’ ట్యాబ్‌కు వెళ్లి ‘మార్క్ ఎగ్జిట్‌’ను క్లిక్ చేయాలి.
  3. అక్కడ గత కంపెనీ నుంచి వైదొలిగిన తేదీని.. దానికి గల సరైన కారణాన్ని తెలిపాలి.
  4. ఆ తర్వాత ‘రిక్వెస్ట్ ఓటీపీ’ ఆప్షన్ మీద క్లిక్ చేసి.. వచ్చిన వన్ టైం పాస్వర్డ్‌ను ఎంటర్ చేయాలి.
  5. ఇక చివర్లో అప్డేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ క్లోజింగ్ డేట్ నమోదు పూర్తవుతుంది.

కాగా, ఈ ప్రక్రియను మొదలుపెట్టే ముందు మీరు గతంలో పని చేసిన కంపెనీ సదరు వివరాలను నమోదు చేసిందో లేదో ఒకసారి చెక్ చేయండి. అంతేకాకుండా ఉద్యోగులు తమ క్లోజింగ్ డేట్‌ను పై విధంగా నమోదు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఉద్యోగం నుంచి తప్పుకుని రెండు నెలలు పూర్తవ్వాలి. పాత కంపెనీ చివరిసారిగా జమ చేసిన పీఎఫ్ మొత్తం రెండు నెలలు దాటినట్లయితేనే ఈ మార్పులకు వీలుంటుంది.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన