గుడ్ న్యూస్.. ఇకపై మూడు రోజుల్లోనే పెన్షన్ విత్ డ్రా..

పెన్షన్ విత్ డ్రాలు ఆలస్యం కాకూడదనే ఉద్దేశ్యంతో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(AI) సౌకర్యాన్ని అందుబాటులో తెచ్చింది. ఐదు రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఏర్పాటు అయిన...

  • Ravi Kiran
  • Publish Date - 9:28 am, Thu, 11 June 20
గుడ్ న్యూస్.. ఇకపై మూడు రోజుల్లోనే పెన్షన్ విత్ డ్రా..

కరోనా వైరస్ మహమ్మారి నేపధ్యంలో గత రెండు నెలలుగా పెన్షన్ డబ్బులను విత్ డ్రా చేసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనితో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపిఎఫ్ఓ)కు క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌ విషయంలో అధిక భారం పడుతోంది. ఉద్యోగుల కొరత ఏర్పడటంతో.. తాజాగా EPFO నూతన విధానాన్ని అమలులో తీసుకొచ్చింది.

పెన్షన్ విత్ డ్రాలు ఆలస్యం కాకూడదనే ఉద్దేశ్యంతో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(AI) సౌకర్యాన్ని అందుబాటులో తెచ్చింది. ఐదు రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఏర్పాటు అయిన ఈ విధానం ద్వారా దాదాపు 54 శాతం COVID-19 క్లెయిమ్స్ ఇప్పుడు ఆటో మోడ్‌లోనే పరిష్కారం అవుతున్నాయని EPFO తెలిపింది.

ఈ ఏఐ సౌకర్యం వల్ల కేవలం 3 రోజుల్లోనే PF విత్ డ్రా చేసుకునే అవకాశం లభిస్తుంది. కాగా, గతేడాది ఏప్రిల్, మే నెలల్లో 33.75 లక్షల మంది PF విత్ డ్రా చేసుకోగా.. ఈ ఏడాది కేవలం ఈ 2 నెలల్లో 36 లక్షల మంది పైగా విత్ డ్రా చేసుకున్నారు. కాగా, ప్రతీ రోజూ సుమారుగా 80,000 ఈపీఎఫ్ క్లెయిమ్స్‌  ఆటోమేషన్ ద్వారా పరిష్కారం అవుతున్నాయని తెలుస్తోంది.