AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆసుపత్రికి వెళ్లి బుద్ధిగా వైద్యం చేయించుకున్న కోతి.. వీడియో వైరల్..!

సాధారణంగా దెబ్బలు తగిలితే మనుషులు ఆసుపత్రికి వెళుతుంటారు. మరి మూగ జీవాలు ఎక్కడికి వెళతాయి..? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమే.

ఆసుపత్రికి వెళ్లి బుద్ధిగా వైద్యం చేయించుకున్న కోతి.. వీడియో వైరల్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 11, 2020 | 9:12 AM

Share

సాధారణంగా దెబ్బలు తగిలితే మనుషులు ఆసుపత్రికి వెళుతుంటారు. మరి మూగ జీవాలు ఎక్కడికి వెళతాయి..? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమే. మూగజీవాలను పెంచుకునే వారిని పక్కనపెడితే.. సాధారణంగా బతికే జంతువులు గాయపడితే అవి ఎక్కడికి వెళ్లలేవు. ఆ సమయానికి ఎవరో దేవుడిలా వచ్చి వాటికి వైద్యం చేయడం లేదా ఆసుపత్రికి తీసుకెళ్లడం తప్పిస్తే. అయితే ఓ కోతికి మాత్రం దెబ్బ తగిలితే ఎక్కడికి వెళ్లాలో బాగా తెలుసు. అందుకే గాయపడిన వెంటనే సరాసరి ఆసుపత్రికి వెళ్లింది.

అంతేకాదు లోపల డాక్టర్ ఉన్నారో లేదోనని బయటే చాలా సేపు సహనంతో ఎదురుచూసింది. దాన్ని గమనించిన డాక్టర్ కోతిని తీసుకెళ్లి వైద్యం చేశారు. ఆ సమయంలో తనకు దెబ్బ ఎక్కడ తగిలిందో చెబుతూ.. డాక్టర్‌కి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా బుద్దిగా వైద్యం చేయించుకుంది ఈ వానరం. ఇక కోతికి చికిత్స అందించే సమయంలో దానికి తోడు మరో కోతి కూడా దగ్గర్లో ఉండటం విశేషం. ఆ తరువాత ఆ రెండు కోతులు ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ ఘటన కర్ణాటకలోని దండేలీలో జరగ్గా.. దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆ వైద్యుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నువ్వు చల్లగా ఉండాలంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే కోతి తెలివిని మెచ్చుకుంటున్నారు.

Read This Story Also: బాలయ్య ఇంతవరకు యాడ్‌లలో ఎందుకు నటించలేదో తెలుసా..!

భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..