దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధం

దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నియోజకవర్గంలో లక్షా 98 వేల 807 మంది ఓటర్లు ఉన్నారు. 315 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 104 కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ జరపనున్నారు. సిబ్బందికి పోలింగ్‌ నిర్వహణపై ట్రైనింగ్‌ ఇచ్చి..

దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధం
Follow us

|

Updated on: Nov 02, 2020 | 9:35 PM

దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నియోజకవర్గంలో లక్షా 98 వేల 807 మంది ఓటర్లు ఉన్నారు. 315 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 104 కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ జరపనున్నారు. సిబ్బందికి పోలింగ్‌ నిర్వహణపై ట్రైనింగ్‌ ఇచ్చి.. ఈవీఎంలు పంపిణీ చేశారు.

కరోనా నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల దగ్గర అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడంతో పాటు మాస్క్‌లు, గ్లౌస్‌లు అందుబాటులో ఉంచారు. ఇక నియోజకవర్గంలో 70మంది కరోనా బాధితులు ఉండటంతో వారికి పీపీఈ కిట్స్‌ అరేంజ్‌ చేశారు. పోలింగ్‌ కేంద్రాలను పూర్తిగా శానిటైజేషన్‌ చేస్తున్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం దగ్గర ఓ ఆశావర్కర్‌, ఏఎన్ఎంలు ఉంటారు. ఓటర్ల టెంపరేచర్‌ చెక్‌ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు.

దుబ్బాక ఓటర్లకు కరోనా భయాందోళన అక్కర్లేదన్నారు కలెక్టర్ భారతి. పూర్తి సురక్షితంగా ఉండేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 89 పోలింగ్‌ సెంటర్స్‌ను సమస్యాత్మకంగా గుర్తించారు అధికారులు. ఆయా కేంద్రాల్లో 2 వేల మంది పోలీసులతో అదనపు భద్రత కల్పిస్తున్నారు. కేంద్ర బలగాలతో పాటు పది జిల్లాల నుంచి పోలీసులను రప్పించారు.

దుబ్బాక నియోజకవర్గంలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్పెషల్‌ టీమ్స్‌ను  ఏర్పాటు చేశామని సిద్ధిపేట సీపీ జోయల్‌ డేవిస్‌. మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న దుబ్బాక బైపోల్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా.. పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఇక ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడమే తరువాయి..