కమల్ నాథ్ కు ఝలక్.. స్టార్ క్యాంపెయినర్ హోదా రద్దు చేసిన ఈసీ
ఒక మహిళా అభ్యర్థిని ‘ఐటెం’ అంటూ సంభోదించినందుకు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కమల్ నాథ్ తగిన మూల్యం చెల్లించుకున్నారు. కమల్ నాథ్ వ్యాఖ్యల పట్ల ఎన్నికల కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అతనికున్న స్టార్ క్యాంపెయినర్ హోదాను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మహిళ పట్ల ఇలాంటి పదాలను వాడటం కమిషన్ జారీ చేసిన నియమాలను ఉల్లంఘించడమే అని పేర్కొంది. […]

ఒక మహిళా అభ్యర్థిని ‘ఐటెం’ అంటూ సంభోదించినందుకు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కమల్ నాథ్ తగిన మూల్యం చెల్లించుకున్నారు. కమల్ నాథ్ వ్యాఖ్యల పట్ల ఎన్నికల కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అతనికున్న స్టార్ క్యాంపెయినర్ హోదాను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మహిళ పట్ల ఇలాంటి పదాలను వాడటం కమిషన్ జారీ చేసిన నియమాలను ఉల్లంఘించడమే అని పేర్కొంది. రాజకీయ పార్టీ నాయకుడిగా ఉన్నప్పటికీ, కమల్ నాథ్ ప్రవర్తనా నియమావళి నిబంధనలను పదేపదే ఉల్లంఘించారని తెలిపింది. ప్రస్తుత మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కమల్ నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఫలితంగా ఇకనుంచి కమల్ నాథ్ ఏదైనా నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటే.. మొత్తం వ్యయాన్ని ఆ నియోజకవర్గ అభ్యర్థినే భరించాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ తన ఉత్తర్వులలో స్పష్టం చేసింది.