దేశంలో 18 కోట్ల మందికి కరోనా వైరస్ దరిచేరదంట..!

దేశంలో 18 కోట్ల మంది భారతీయులు ఇప్పటికే కరోనా బారినపడి ఉండవచ్చని థైరోకేర్ ప్రైవేట్ ల్యాబ్ విడుదల చేసిన డేటా వెల్లడించింది. దేశంలో దాదాపు 15 శాతం మంది కరోనావైరస్ వ్యతిరేకంగా తమ శరీరంలో యాంటీబాడీస్ కలిగి వుండవచ్చని తమ డేటా సూచిస్తుందని థైరోకేర్ మేనేజింగ్ డైరెక్టర్ అరోకిస్వామి వేలుమణి తెలిపారు.

దేశంలో 18 కోట్ల మందికి కరోనా వైరస్ దరిచేరదంట..!
Follow us

|

Updated on: Jul 21, 2020 | 10:04 PM

దేశంలో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. ప్రధాన నగరాలనుంచి పల్లెల దాకా ప్రతి ఒక్కిరిని వైరస్‌ వణికిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటం మరింత ఆందోళన కలిగిస్తున్నది. దేశంలో తొలి కోవిడ్-19 కేసు నమోదైన నాలుగు నెలల తర్వాత ఆ కేసుల సంఖ్య రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. దీనికి తోడు మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ప్రపంచంలో అత్యధికంగా నమోదవుతున్న కేసుల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది.

అయితే, మన దేశంలో 18 కోట్ల మంది భారతీయులు ఇప్పటికే కరోనా బారినపడి ఉండవచ్చని థైరోకేర్ ప్రైవేట్ ల్యాబ్ విడుదల చేసిన డేటా వెల్లడించింది. దేశంలో దాదాపు 15 శాతం మంది కరోనావైరస్ వ్యతిరేకంగా తమ శరీరంలో యాంటీబాడీస్ కలిగి వుండవచ్చని తమ డేటా సూచిస్తుందని థైరోకేర్ మేనేజింగ్ డైరెక్టర్ అరోకిస్వామి వేలుమణి తెలిపారు.

థైరోకేర్ అనే ప్రైవేట్ ల్యాబ్ దేశవ్యాప్తంగా 20 రోజులలో నిర్వహించిన యాంటీబాడీ పరీక్షల డేటాను వెల్లడించింది. దేశవ్యాప్తంగా 18 కోట్ల మందిలో కరోనావైరస్ వ్యతిరేకంగా ఇమ్యూనిటి పవర్ వున్నట్లు డేటా సూచిస్తుంది. 20 రోజులలో 600 ప్రాంతాల్లో నిర్వహించిన 60,000 యాంటీబాడీ పరీక్షల నుండి థైరోకేర్ తన డేటాను సేకరించింది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ దేశంలో కొవిడ్-19 కొరకు రెండు రకాల పరీక్షలకు అనుమతినిచ్చింది. RT-PCR పరీక్షలతో పాటు యాంటీబాడీ పరీక్షలకు వీలు కల్పించింది. ఈ పరీక్షలను ప్రభుత్వం గుర్తించిన కొన్ని ప్రైవేట్ ల్యాబ్‌లు కూడా నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఇందులో భాగంగా థైరోకేర్ ప్రైవేట్ ల్యాబ్ 60,000 మంది పరీక్షల నుండి డేటాను సేకరించింది. థైరోకేర్ అంచనా ప్రకారం దేశంలో దాదాపు 15 శాతం మందికి ఇప్పటికే కరోనావైరస్‌ను అడ్డుకోగల శక్తిని కలిగి వున్నారని తెలిపింది. ఇందుకు సంబంధించి థైరోకేర్ మేనేజింగ్ డైరెక్టర్ అరోకిస్వామి వేలుమణి తన ట్విట్టర్ ద్వారా డేటాను పంచుకున్నారు.

దేశ వ్యాప్తంగా 90% మందికి ఇంకా కరోనా ఉన్నట్లుగా నిర్థారణ కాలేదన్నారు. 9% మందికి కొవిడ్ సోకినప్పటికీ ఎలాంటి లక్షణాలు లేవని వెల్లడించారు. 0.9% మందికి కొద్దిపాటి లక్షణాలు ఉన్నప్పటికీ రోగ నిరోధక శక్తి కారణంగా త్వరగా కోలుకున్నారు. 0.09% మంది రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల అనారోగ్యానికి గురయ్యారని వెల్లడించారు. 0.01% మందిలో అసలు రోగనిరోధక శక్తి లేదని దీంతో తీవ్రంగా జబ్బుపడినట్లు తమ అధ్యయనంలో బహిర్గతమైందని అరోకిస్వామి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

అయితే, జూన్ నెలలో భారత అత్యున్నత పరిశోధనా సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) నిర్వహించిన రెండవ సెరోప్రెవలెన్స్ అధ్యయనంలో వచ్చిన ఫలితాలతో తమ డేటా సరి సమానం ఉందని థైరోకేర్ సంస్థ పేర్కొంది. అటు, ఐసిఎంఆర్ ఎలాంటి డేటాను వెల్లడించలేదు.

తమ నివేదికల ఆధారంగా భారతీయులు ఇప్పటికే నిశ్శబ్దంగా వైరస్ నుండి రోగనిరోధక శక్తిని పొందారని డేటా చెబుతోంది. మరోవైపు డేటాను నిశితంగా అధ్యయనం చేయాలంటే, వైరస్ విస్తృతంగా ఉన్న ప్రదేశాలలో అత్యధిక సంఖ్యలో యాంటీబాడీ-పాజిటివ్ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరముందన్నారు. కరోనావైరస్ కు వ్యతిరేకంగా యూకే వంటి దేశాలు రోగనిరోధక శక్తిని కొంత స్థాయికి చేరుకున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఏదేమైనా, భారతదేశంలో కరోనా వైరస్ గరిష్ట స్థాయికి చేరుకుందా? రోగనిరోధక శక్తి ఏ స్థాయిలో ఉందనేది ఇప్పటికీ స్పష్టత లేదు. డాక్టర్ వేలుమణి ప్రకారం, రోగనిరోధక శక్తి అనే పదం కొద్దిగా అస్పష్టంగా ఉన్నప్పటికీ, అతని వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం, వైరస్ నిశ్శబ్దంగా వ్యాప్తి చెందుతుందని వెల్లడించారు. ఏదీ ఎమైనా ఖచ్చితమైన ఆధారాలు ఏవీ లేవని స్పష్టమవుతోంది.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన