చందా కొచ్చర్‌ దంపతులకు ఈడీ సమన్లు

ఐసీఐసీఐ బ్యాంకు-వీడియోకాన్‌ రుణాల మంజూరు వ్యవహారంలో మనీలాండరింగ్‌ క్రిమినల్‌ కేసును ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మే 3న చందా కొచ్చర్‌, ఏప్రిల్‌ 30న దీపక్‌ కొచ్చర్‌, ఆయన సోదరుడు రాజీవ్‌లు విచారణాధికారి ఎదుట హాజరుకావాల్సి ఉంది. అంతేకాకుండా వారి వ్యక్తిగత, వృత్తి పరమైన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు తీసుకురావాల్సిందిగా వారికి తెలియజేసినట్లు ఈ కేసు విచారణ […]

చందా కొచ్చర్‌ దంపతులకు ఈడీ సమన్లు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 23, 2019 | 6:47 PM

ఐసీఐసీఐ బ్యాంకు-వీడియోకాన్‌ రుణాల మంజూరు వ్యవహారంలో మనీలాండరింగ్‌ క్రిమినల్‌ కేసును ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మే 3న చందా కొచ్చర్‌, ఏప్రిల్‌ 30న దీపక్‌ కొచ్చర్‌, ఆయన సోదరుడు రాజీవ్‌లు విచారణాధికారి ఎదుట హాజరుకావాల్సి ఉంది. అంతేకాకుండా వారి వ్యక్తిగత, వృత్తి పరమైన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు తీసుకురావాల్సిందిగా వారికి తెలియజేసినట్లు ఈ కేసు విచారణ చేస్తున్న అధికారులు వెల్లడించారు. గతంలో ఈ కేసుకు సంబంధించి ముంబయి, ఔరంగాబాద్‌ ప్రాంతాల్లో ఉన్న చందా కొచ్చర్‌, ఆమె కుటుంబ సభ్యులు, వీడియోకాన్‌ గ్రూప్‌కి చెందిన వేణుగోపాల్ ధూత్‌ ఇళ్లలో సోదాలు చేసిన అనంతరం ముంబయిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కార్యాలయంలో వారిని విచారించిన విషయం విదితమే .