AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముగిసిన మూడో విడత పోలింగ్‌.. పశ్చిమ బెంగాల్, యూపీలో హింసాత్మక ఘటనలు

దేశంలో మూడోదశ ఎన్నికలకు పోలింగ్ గడువు ముగిసింది. దేశంలోని 116 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్, యూపీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో హింస భారీగా జరిగింది. ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ముర్షీదాబాద్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓ దుండగుడు బాంబు విసిరాడు. మరికొన్నిచోట్ల బీజేపీ- టీఎంసీ కార్యకర్తలు కొట్టుకున్నారు. ఓ పోలింగ్ బూత్ బయట ఏర్పాటు చేసిన టెంట్లను పీకేశారు. పలువురు ప్రముఖులు కూడా ఈ […]

ముగిసిన మూడో విడత పోలింగ్‌.. పశ్చిమ బెంగాల్, యూపీలో హింసాత్మక ఘటనలు
Ram Naramaneni
|

Updated on: Apr 23, 2019 | 5:52 PM

Share

దేశంలో మూడోదశ ఎన్నికలకు పోలింగ్ గడువు ముగిసింది. దేశంలోని 116 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్, యూపీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో హింస భారీగా జరిగింది. ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ముర్షీదాబాద్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓ దుండగుడు బాంబు విసిరాడు. మరికొన్నిచోట్ల బీజేపీ- టీఎంసీ కార్యకర్తలు కొట్టుకున్నారు. ఓ పోలింగ్ బూత్ బయట ఏర్పాటు చేసిన టెంట్లను పీకేశారు. పలువురు ప్రముఖులు కూడా ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లోని ఓ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసేముందు గాంధీనగర్‌లోని తన మాతృమూర్తి నివాసానికి వెళ్లి ఇంటి పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం తన మాతృమూర్తి వద్దకు వెళ్లి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. తల్లి యోగక్షేమాలు తెలుసుకున్న అనంతరం అహ్మదాబాద్‌లోని రణీబ్‌ చేరుకొని అక్కడ ఓ చిన్నారిని ఎత్తుకొని ముద్దు చేశారు. అనంతరం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధానితో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కూడా పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. అనంతరం ప్రధాని ప్రజలకు అభివాదం చేస్తూ.. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే పెద్ద పండుగ అని అంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

దేశంలోని 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 116 నియోజకవర్గాల జరుగుతున్న ఈ ఎన్నికల్లో 1,640 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గుజరాత్ 26 స్థానాలు, కేరళ 20, గోవా 2, కర్ణాటక 14, మహారాష్ట్ర 14, ఒడిషా 6, పశ్చిమ బెంగాల్ 5, అసోం 4, బీహార్ 5, చత్తీస్ గడ్ 7, జమ్మూ కాశ్మీర్ 1 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా, డయ్యూడామన్, దాద్రా నగర్ హవేలీ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్కో నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించారు.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత