ఈసీ పై కాంగ్రెస్ ఫైర్!

ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సంఘం(ఈసీ)పై విరుచుకుపడింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వుల్లో అసమ్మతి, మైనార్టీ అభిప్రాయాలను వెల్లడి చేసేందుకు ఈసీ నిరాకరించడాన్ని ఆ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ఇలాంటి చర్యలు రాజ్యాంగాన్ని అవహేళన చేయడమేనని అభిప్రాయపడింది. ఇలాంటి విధానాలతో ఈసీ తమ విధుల నిర్వహణలో ‘చీకటి రహస్యాలు, ఏకాంత సంభాషణలు’ అనే కొత్త సంప్రదాయానికి తెరతీస్తోందని ఆరోపించింది. ఈసీ తన విధులనే సక్రమంగా నిర్వర్తించనపుడు ఎన్నికల నిర్వహణను […]

ఈసీ పై కాంగ్రెస్ ఫైర్!
Follow us

| Edited By:

Updated on: May 22, 2019 | 4:56 PM

ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సంఘం(ఈసీ)పై విరుచుకుపడింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వుల్లో అసమ్మతి, మైనార్టీ అభిప్రాయాలను వెల్లడి చేసేందుకు ఈసీ నిరాకరించడాన్ని ఆ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ఇలాంటి చర్యలు రాజ్యాంగాన్ని అవహేళన చేయడమేనని అభిప్రాయపడింది. ఇలాంటి విధానాలతో ఈసీ తమ విధుల నిర్వహణలో ‘చీకటి రహస్యాలు, ఏకాంత సంభాషణలు’ అనే కొత్త సంప్రదాయానికి తెరతీస్తోందని ఆరోపించింది. ఈసీ తన విధులనే సక్రమంగా నిర్వర్తించనపుడు ఎన్నికల నిర్వహణను మాత్రం సక్రమంగా ఎలా నిర్వహించగలదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు.

Latest Articles