నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్…

నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది. రైల్వేలో ఉద్యోగం పొందాలనుకుంటున్న వారు వెంటనే అప్లయ్ చేసుకోండి. వేర్వేరు జోన్లలో పలు పోస్టులకు వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. తాజాగా 2792 అప్రెంటీస్ పోస్టులకు గానూ..

  • Ravi Kiran
  • Publish Date - 8:45 am, Fri, 28 February 20
నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్...

Eastern Railways: నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది. రైల్వేలో ఉద్యోగం పొందాలనుకుంటున్న వారు వెంటనే అప్లయ్ చేసుకోండి. వేర్వేరు జోన్లలో పలు పోస్టులకు వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. తాజాగా 2792 అప్రెంటీస్ పోస్టులకు గానూ ఈస్టర్న్ రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికి దరఖాస్తుల స్వీకరణ ముందుగా ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అంతేకాకుండా మార్చి 13న లాస్ట్ డేట్‌గా ఈస్టర్న్ రైల్వే ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ నోటిఫికేషన్‌ను సవరించి తాజాగా విడుదల చేశారు. దీని బట్టి మార్చి 5 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ 4న చివరి తేదీగా వెల్లడించారు. కాగా, ఆ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఖాళీలు – 2792

దరఖాస్తు ప్రారంభ తేదీ – 05.03.2020

చివరి తేదీ – 04.04.2020(18.30 hrs.)

విద్యార్హత – 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ సర్టిఫికెట్ ఉండాలి

వయసు – 15 నుంచి 24 ఏళ్లు 

ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగులకు నో ఫీజు.. మిగిలినవారికి రూ.100 అప్లికేషన్ ఫీజ్

పూర్తి వివరాలు కోసం ఈ వెబ్‌సైట్ చూడండి.. http://www.er.indianrailways.gov.in 

For More News:

వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. బిల్లు చెల్లించకపోతే ఆటోమేటిక్‌గా పవర్ కట్..!

జగన్ మరో సంచలనం.. ఇక నుంచి ప్రజాసేవలో మంత్రులు కూడా..

విషాదం: ఫ్లెక్సీ కడుతూ వైఎస్ జగన్ స్నేహితుడు మృతి..!

ఇదెక్కడి విచిత్రమో! అమలాపురం స్కూల్‌లో స్టూడెంట్స్ అందరూ కవలలే..

కిక్కిచ్చే వార్త.. లేడీస్ కోసం ప్రత్యేక మద్యం షాపులు..!