దుర్గగుడి చైర్మన్ సోమినాయుడు సంచలన వ్యాఖ్యలు..
దుర్గగుడి చైర్మన్ సోమినాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈవోతో మాట్లాడి క్షుద్రపూజలు చేయించారని ఆరోపించారు. మరి ఆనాటి ఘటనపై అప్పటి దేవాదాయ శాఖ మంత్రితో రాజీనామా చేయించారా? అని ప్రశ్నించారు సోమినాయుడు.

Pyla Sominaidu : దుర్గగుడి చైర్మన్ సోమినాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈవోతో మాట్లాడి క్షుద్రపూజలు చేయించారని ఆరోపించారు. మరి ఆనాటి ఘటనపై అప్పటి దేవాదాయ శాఖ మంత్రితో రాజీనామా చేయించారా? అని ప్రశ్నించారు సోమినాయుడు. 2016లో టీడీపీ హయాంలో ఘాట్ రోడ్డులో ఉన్న రధాన్ని తీసుకెళ్లి జమ్మిదోడ్డిలో పెట్టారని దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు. ఆ తరువాత మహామండపం కింద పెట్టారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రథాన్ని వినియోగించలేదన్నారు. 2019 ఏప్రిల్ 6న నిర్వహించిన ఉగాది ఉత్సవాలు తర్వాత ఈ రథాన్ని దేవస్థానం ఉపయోగించలేదని… ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ఉగాది ఉత్సవాలు నిర్వహించలేకపోయామని అన్నారు. మల్లికార్జున మహామండపం కింద దాన్ని ఉంచి మొత్తం ప్లాస్టిక్ కవర్‌తో కప్పేశారు.
పాత ఈవో ఉన్నపుడు కప్పిన కార్పెట్‌ని ఇప్పటి వరకు మేము తీయలేదన్నారు. అయితే అంతర్వేది ఘటన తరువాత రథాన్ని భద్రత కల్పచాలని తెరిచామన్నారు. అప్పుడు విషయం నిన్న స్ట్రాంగ్ రూమ్ లో చెక్ చేశాం అక్కడ కూడా విగ్రహాలు లేవుని దీంతో విషయం బయటకు వచ్చిందన్నారు. మూడు సింహాలను తిరిగి చేయిస్తున్నామని అన్నారు. ఆలయానికి భద్రత వ్యవహారాలు చూస్తున్న మాక్స్ సెక్యూరిటీ ఏజెన్సీ త్వరలోనే విగ్రహాలు చేపిస్తామని ఈఓ కి లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారని గుడి ఛైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు.
ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ వెండి రథానికి ఉండాల్సిన మూడు సింహం ప్రతిమలు మాయం కావడంపై భక్తుల నుంచి విస్మయం వ్యక్తమవుతోంది. సింహం ప్రతిమలు మాయమైనట్లు ఇప్పుడు బయటపడినప్పటికీ, అవి ఎప్పుడు మాయం అయ్యాయనే అంశంపై విచారణ జరగనుంది. రథంపై అమ్మవారు ఉగాది రోజున, చైత్ర మాసోత్సవాల్లోనూ భక్తులకు దర్శనం ఇస్తారు.




