దుండిగల్ దగ్గర రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థుల బ్యాగ్ లో కేజీ గంజాయి

మత్తుకు బానిసై ఉజ్వలమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు విద్యార్థులు. హైదరాబాద్‌ శివారు దుండిగల్‌ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో...

  • Venkata Narayana
  • Publish Date - 5:50 am, Mon, 7 December 20
దుండిగల్ దగ్గర రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థుల బ్యాగ్ లో కేజీ గంజాయి

మత్తుకు బానిసై ఉజ్వలమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు విద్యార్థులు. హైదరాబాద్‌ శివారు దుండిగల్‌ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారిని నిజామాబాద్‌కు చెందిన విశాల్‌, సుజీత్‌గా నిర్ధారించారు పోలీసులు. అయితే ప్రమాద సమయంలో వారి దగ్గర ఉన్న ఎరుపు రంగు బ్యాగ్‌లో కేజీ గంజాయిని పోలీసులు గుర్తించారు. ఈ గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎవరి కోసం తీసుకొస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వారు మద్యం సేవించి బైక్‌ నడిపారా ? లేదా ? అనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నామని దుండిగల్‌ పోలీసులు తెలిపారు. ఇలా ఉండగా, మృతులు విశాల్, సుజిత్‌ సెంట్ పీటర్ కాలేజిలో ఇంజినీరింగ్‌ చదువుతున్నారు. వీరు మైసమ్మగూడ హాస్టల్ ఉంటూ శనివారం రాత్రి ప్రమాదానికి గురైయ్యారు. డెడ్‌ బాడీలకు పోస్టుమార్టం పూర్తి చేసి.. తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.