వారెవా ! ‘మందు కొట్టిన గేదెలు’..ముగ్గురు రైతులను అరెస్టు చేసిన పోలీసులు.. ఎక్కడంటే ?
గుజరాత్ లో 'మందు కొట్టిన గేదెలు' తమ యజమానులైన ముగ్గురు రైతులను పోలీసులకు పట్టించాయి.. వింతగా ఉన్నా ఇది నిజం.. అదెలాగంటే..
గుజరాత్ లో ‘మందు కొట్టిన గేదెలు’ తమ యజమానులైన ముగ్గురు రైతులను పోలీసులకు పట్టించాయి.. వింతగా ఉన్నా ఇది నిజం.. అదెలాగంటే.. ఈ రాష్ట్రంలో అక్రమ మద్యం అమ్మకంగానీ, తాగడం గానీ, రవాణా చేయడంగానీ నిషిద్ధం. అయితే అహ్మదాబాద్ లో ముగ్గురు రైతులు ఎక్కడి నుంచి ఎలా సంపాదించారో గానీ సారా వంటి మద్యాన్ని సంపాదించారు. ఈ బాటిల్స్ ని తమ ఇళ్లలో దాచి పెడితే ఎక్కడ పోలీసులకు తెలుస్తుందోనని తమ పొలాల్లోని నీటి కాలువల తూముల్లో దాచారు. సమయం వచ్చినప్పుడు ఈ మద్యాన్ని రహస్యంగా అమ్మి సొమ్ము చేసుకుందామనుకున్నారో లేక అప్పుడప్పుడు తాగుదామనుకున్నారో తెలియదు గానీ.. మొత్తానికి వీరు తలచింది ఒకటైతే జరిగింది మరొకటి అయింది. ఆ తూముల్లో దాచిన కొన్ని బాటిల్స్ పైని మూతలు విరిగిపోయి మద్యం నీళ్లలో కలిసిపోయింది. ఆ నీటిని తాగిన గేదెలు ఇక వింతగా ప్రవర్తించడం ప్రారంభించాయి. ఇది చూసిన రైతులు గాభరా పడి వెటర్నరీ డాక్టర్ నుతీసుకొచ్చి చూపితే ఆయన వాటిని పరీక్షించాడు..
రైతులను అసలు వివరాలు అడిగాడు..వీరి పొలాల వెంబడి గల కాలువల నీళ్లు తాగడం వల్లే ఇవి ఇలా ప్రవర్తిస్తున్నాయని తెలుసుకున్నాడు. ఆ నీరు కూడా కలుషితం కావడమే కాక..ఒకవిధంగా వాసన కూడా వస్తున్నాయట.. చివరకు ఆ డాక్టర్ ఫిర్యాదుపై పోలీసులు వచ్చి ఆ ముగ్గురు రైతులను అరెస్టు చేశారు. మందు కొట్టిన గేదెలు మెల్లగా కోలుకున్నాయి. రాష్ట్రంలోనే ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి..
మరిన్ని ఇక్కడ చూడండి: లాహోర్ లో జరిగిన బాంబు దాడిపై పాకిస్తాన్ ఆరోపణలు పూర్తిగా నిరాధారం.. ఇండియా ఫైర్
Telangana Crime News: పక్కింటికే కన్నం వేసిన పోకిరి.. ఎలా చిక్కాడంటే..?