టైట్ జీన్స్‌తో కారు డ్రైవింగ్ చేస్తున్నారా.. అయితే మీ ప్రాణానికి ప్రమాదం ఉన్నట్లే!
టైటిల్ చూసి మీరు కొంచెం విడ్డూరంగా ఉందేంటని అనుకోవచ్చు.. టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల ప్రాణానికి ప్రమాదం ఏంటని ఆలోచించవచ్చు. కానీ ఇది నిజం.. తాజాగా 30 ఏళ్ళ సౌరభ్ శర్మ అనే వ్యక్తి సరిగ్గా ఇదే కారణం వల్ల హాస్పిటల్ పాలయ్యాడు. అంతేకాకుండా అతను ప్రాణాల మీదకు వచ్చినంత పనైంది కూడా. వివరాల్లోకి వెళ్తే… ఢిల్లీకి చెందిన సౌరభ్ శర్మ(30) తన ఫ్రెండ్స్‌తో కలిసి గేరు లేని ఆటోమేటిక్ కారులో రిషికేశ్ బయల్దేరాడు. ఆ సమయంలో అతను […]
టైటిల్ చూసి మీరు కొంచెం విడ్డూరంగా ఉందేంటని అనుకోవచ్చు.. టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల ప్రాణానికి ప్రమాదం ఏంటని ఆలోచించవచ్చు. కానీ ఇది నిజం.. తాజాగా 30 ఏళ్ళ సౌరభ్ శర్మ అనే వ్యక్తి సరిగ్గా ఇదే కారణం వల్ల హాస్పిటల్ పాలయ్యాడు. అంతేకాకుండా అతను ప్రాణాల మీదకు వచ్చినంత పనైంది కూడా. వివరాల్లోకి వెళ్తే…
ఢిల్లీకి చెందిన సౌరభ్ శర్మ(30) తన ఫ్రెండ్స్‌తో కలిసి గేరు లేని ఆటోమేటిక్ కారులో రిషికేశ్ బయల్దేరాడు. ఆ సమయంలో అతను టైట్ డెనిమ్ జీన్స్ ధరించాడు. సుమారు ఎనిమిది గంటల పాటు నిరంతరాయంగా నడపడంతో అతనికి ఎడమ కాలు కాస్త తిమ్మిరి ఎక్కినట్లు అనిపించింది. అంతేకాకుండా ఢిల్లీకి తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సౌరభ్ శర్మ తెగ ఇబ్బంది పడ్డాడు. దీనితో ఆసుపత్రికి వెళ్లిన అతడికి.. వైద్యులు పరీక్షలు చేసి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని నిర్ధారించారు.
సౌరభ్ ఆసుపత్రికి వచ్చినప్పుడు పల్స్ రేట్ 10-12 మధ్య ఉందని.. అంతేకాకుండా అతడు టైట్ జీన్స్ ధరించి ఏకధాటిగా 8 గంటలు కారు నడపడం వల్ల ఒక కాలుపై ఒత్తిడి విపరీతంగా పెరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. దీని వల్లే గుండెపోటు రావడానికి కారణమయ్యిందని అన్నారు. అందుకే ప్రయాణ సమయాల్లో టైట్ జీన్స్‌లు ధరించడం మంచిది కాదని వారి వాదన.