AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ 2020: టైటిల్‌ స్పాన్సర్‌గా.. ఆన్‌లైన్ ఫాంటసీ స్పోర్ట్స్ ‘డ్రీమ్‌11’

ఆన్‌లైన్ ఫాంటసీ స్పోర్ట్స్ సంస్థ డ్రీమ్ 11, రూ.222 కోట్లతో (సుమారు .533.5 మిలియన్లు) ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ హక్కుల కోసం బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్నది. డ్రీమ్‌ 11 ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌ హక్కులను

ఐపీఎల్ 2020: టైటిల్‌ స్పాన్సర్‌గా..  ఆన్‌లైన్ ఫాంటసీ స్పోర్ట్స్ 'డ్రీమ్‌11'
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 18, 2020 | 3:33 PM

Share

ఆన్‌లైన్ ఫాంటసీ స్పోర్ట్స్ సంస్థ డ్రీమ్ 11, రూ.222 కోట్లతో (సుమారు .533.5 మిలియన్లు) ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ హక్కుల కోసం బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్నది. డ్రీమ్‌ 11 ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌ హక్కులను దక్కించుకుందని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ వెల్లడించారు. డ్రీమ్‌ 11 నాలుగు నెలల 13 రోజుల పాటు స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ప‌తంజ‌లి, అడిడాస్‌, జియో క‌మ్యూనికేష‌న్స్‌, అన్అకాడ‌మీ, టాటా గ్రూప్‌ తదితర దిగ్గజ కంపెనీలు టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ కోసం పోటీపడ్డాయి.

వివో 2015 లో రెండేళ్లపాటు టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను దక్కించుకుంది. తరువాత 2017 లో ఐదేళ్ల ఒప్పందంతో (2017-22) స్పాన్సర్‌షిప్‌ను కొనసాగించింది. 2018 నుంచి 2022 వ‌ర‌కు ఐపీఎల్ స్పాన్స‌ర్‌గా వివో ఉన్న‌ప్ప‌టికీ.. స‌రిహ‌‌ద్దులో ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో చైనా కంపెనీల‌ను బ‌హిష్క‌రించాల‌నే డిమాండ్ల మేర‌కు చైనా మొబైల్ కంపెనీ స్వ‌చ్ఛందంగా త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. ఐపీఎల్-2020 సీజన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకూ యూఏఈలోని దుబాయ్, షార్జా, అబుధాబిలో నిర్వహించనున్నారు.

Read More:

గోదావరి కి పోటెత్తిన వరద.. జలదిగ్బంధంలో 60 గ్రామాలు..!

సీపీఎల్‌ టి20: నేటి నుంచి కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌!

Follow Us