AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడ డిపాజిట్ చేస్తే.. మీ డబ్బు రెట్టింపవ్వడం ఖాయం

మీరు కచ్చితమైన రాబడిని ఆశిస్తున్నారా..? డిపాజిట్ చేసిన డబ్బుకు రెట్టింపు రావాలనుకుంటున్నారా..? అయితే ఈ అవకాశాన్ని మీ కోసమే. భారత పోస్టాఫీస్‌ రంగం వివిధ రకాల సేవింగ్స్ స్కీమ్స్‌ను అందించే విషయం తెలిసిందే. అందులో పోస్టాఫీస్ కేవీపీ(కిసాన్ వికాస్ పత్ర) స్కీమ్ కూడా ఒక భాగం. అందులో డిపాజిట్ చేయడం వల్ల మీ డబ్బు రెట్టింపు అవుతుంది. అంటే రూ.1,000కి వెయ్యి, రూ.5,000కు రూ.5 వేలు, రూ.10,000కు రూ.10 వేలు, రూ.50,000కు రూ.50 వేలు ఇలా వస్తుంది. […]

అక్కడ డిపాజిట్ చేస్తే.. మీ డబ్బు రెట్టింపవ్వడం ఖాయం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 24, 2019 | 6:43 PM

Share

మీరు కచ్చితమైన రాబడిని ఆశిస్తున్నారా..? డిపాజిట్ చేసిన డబ్బుకు రెట్టింపు రావాలనుకుంటున్నారా..? అయితే ఈ అవకాశాన్ని మీ కోసమే. భారత పోస్టాఫీస్‌ రంగం వివిధ రకాల సేవింగ్స్ స్కీమ్స్‌ను అందించే విషయం తెలిసిందే. అందులో పోస్టాఫీస్ కేవీపీ(కిసాన్ వికాస్ పత్ర) స్కీమ్ కూడా ఒక భాగం. అందులో డిపాజిట్ చేయడం వల్ల మీ డబ్బు రెట్టింపు అవుతుంది. అంటే రూ.1,000కి వెయ్యి, రూ.5,000కు రూ.5 వేలు, రూ.10,000కు రూ.10 వేలు, రూ.50,000కు రూ.50 వేలు ఇలా వస్తుంది.

అయితే ఇందులో మరో ట్విస్ట్ ఉందండి. అందులో డిపాజిట్ చేసిన వెంటనే మీ డబ్బు డబుల్ అవ్వదు. ఇందుకు 113 నెలల సమయం పడుతుంది. అంటే మీరు కేవీపీలో ఇన్వెస్ట్ చేసిన తరువాత 9 ఏళ్ల 5 నెలలు వేచి ఉండాలి. కాగా ప్రస్తుతం కేవీపీ డిపాజిట్లపై 7.6శాతం వడ్డీ లభిస్తోంది.

ఇక కిసాన్ వికాస్ పత్రాలను బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లీ కేవీపీ పత్రాలను కొనొచ్చు. నగదు, చెక్, పే ఆర్డర్, డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) ద్వారా కొనుగోలు చేయవచ్చు. 2.5 ఏళ్ల తర్వాత డబ్బులు అవసరమైతే వీటిని విక్రయించొచ్చు. ఒకవేళ కేవీపీ సర్టిఫికెట్ హోల్డర్ మరణిస్తే అప్పుడు కూడా డబ్బులు వెనక్కు వస్తాయి. అంతేకాదు కేవీపీ సర్టిఫికెట్లను ఒక వ్యక్తి పేరు నుంచి మరో వ్యక్తి పేరుకు మార్చుకోవచ్చు. ఒకవేళ కేవీపీ పత్రం కనిపించకుండాపోతే డూప్లికేట్ కేవీపీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సింగిల్ హోల్డర్ సర్టిఫికెట్, జాయింట్ ఏ టైప్ సర్టిఫికెట్, జాయింట్ బి టైప్ సర్టిఫికెట్ అనే మూడు రకాల కేవీపీలు ఉంటాయి.

అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేసిన ఆ టాలీవుడ్ హీరో..
అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేసిన ఆ టాలీవుడ్ హీరో..
బంగారం, వెండి కొనేందుకు ఇదే సరైన సమయమా?
బంగారం, వెండి కొనేందుకు ఇదే సరైన సమయమా?
బాదం పప్పును తొక్కతో పాటుగా తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
బాదం పప్పును తొక్కతో పాటుగా తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
ప్రతి నీటి బొట్టు కోసం తహతహలాడుతున్న పాకిస్తాన్..!
ప్రతి నీటి బొట్టు కోసం తహతహలాడుతున్న పాకిస్తాన్..!
లివర్ వ్యాధికి విరుగుడు.. కాఫీ తాగితే మొత్తం క్లీన్
లివర్ వ్యాధికి విరుగుడు.. కాఫీ తాగితే మొత్తం క్లీన్
ఇదేమి సంస్కారం? ఇలాగేనా ప్రవర్తించేది? కోహ్లీపై నెటిజన్లు ఫైర్
ఇదేమి సంస్కారం? ఇలాగేనా ప్రవర్తించేది? కోహ్లీపై నెటిజన్లు ఫైర్
సుజిత్‌కు కాస్ల్టీ కారు ఇచ్చిన పవన్.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్
సుజిత్‌కు కాస్ల్టీ కారు ఇచ్చిన పవన్.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్
బీచ్‌లో నడుస్తుండగా కంటపడ్డ చిట్టి ఆక్టోపస్‌..!
బీచ్‌లో నడుస్తుండగా కంటపడ్డ చిట్టి ఆక్టోపస్‌..!
ఓరీ దేవుడో.. రక్తంలా ఎరుపు రంగులోకి మారిన సముద్రం..! కారణం ఏంటంటే
ఓరీ దేవుడో.. రక్తంలా ఎరుపు రంగులోకి మారిన సముద్రం..! కారణం ఏంటంటే
ఈ సమయం తర్వాత భోజనం తింటున్నారా..? మీ పొట్ట గుట్టలా మారుతుందట..
ఈ సమయం తర్వాత భోజనం తింటున్నారా..? మీ పొట్ట గుట్టలా మారుతుందట..