AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అగ్నిప్రమాదం నుండి 30 మందిని కాపాడిన శునకం!

శుక్రవారం రాత్రి బాందా సిటీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఫర్నీచర్ షో రూంలో చెలరేగిన మంటలు పై అంతస్థులకు వ్యాపించాయి. పైనున్న మూడు, నాలుగు అంతస్థులలో కొంతమంది నివసిస్తున్నారు. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అయితే కిందనున్న మంటలు వేగంగా పైకి వెళుతున్నాయి. ప్రమాదాన్ని పసిగట్టిన వారి పెంపుడు కుక్క పెద్దగా అవరడం ప్రారంభించి అందరినీ అలర్ట్ చేసింది. దాని అరుపులతో మేల్కొన్న వాళ్లు.. అక్కడి నుంచి ప్రాణాలతో […]

అగ్నిప్రమాదం నుండి 30 మందిని కాపాడిన శునకం!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 13, 2019 | 3:10 PM

Share

శుక్రవారం రాత్రి బాందా సిటీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఫర్నీచర్ షో రూంలో చెలరేగిన మంటలు పై అంతస్థులకు వ్యాపించాయి. పైనున్న మూడు, నాలుగు అంతస్థులలో కొంతమంది నివసిస్తున్నారు. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అయితే కిందనున్న మంటలు వేగంగా పైకి వెళుతున్నాయి. ప్రమాదాన్ని పసిగట్టిన వారి పెంపుడు కుక్క పెద్దగా అవరడం ప్రారంభించి అందరినీ అలర్ట్ చేసింది.

దాని అరుపులతో మేల్కొన్న వాళ్లు.. అక్కడి నుంచి ప్రాణాలతో సురక్షితంగా బయటపడగలిగారు. 30 మంది ప్రాణాలు దక్కించుకున్నారు. అయితే అంతమందిని ప్రాణాలతో బయటపడేసిన ఆ శునక రాజం.. తను మాత్రం ప్రాణాలు కోల్పోయింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో కట్టేసి ఉండటంతో మంటలకు ఆహుతైపోయింది. ప్రాణాలతో బయటపడ్డ వాళ్లు తమకు పునర్జన్మ నిచ్చిన ఆ మూగజీవి పట్ల కృతజ్ఞతాభావంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. అక్రమంగా ఫర్నీచర్ షోరూమ్ నిర్వహిస్తున్న యజమానిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.