ఈ వైద్యులు చేసిన ఆపరేషన్ చూస్తే… చేతులెత్తి మొక్కాల్సిందే…

“వైద్యో నారాయణో హరి:” అంటారు పెద్దలు. అత్యవసర సమయాల్లో రోగి బంధువులకు డాక్టరే దేవుడిలా కనిపిస్తాడు. ఇది ముమ్మాటికి నిజం. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ తల్లి అవిభక్త కవలలకు జన్మనిచ్చింది. ఉదరం, పొట్ట అతుక్కుని పుట్టిన కవల పిల్లలను జోధ్‌పూర్ ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్లు సర్జరీ చేసి సక్సెస్‌ఫుల్‌గా వేరు చేశారు. దాదాపు నాలుగు గంటలపాటు ఈ ఆపరేషన్ కొనసాగింది. పుట్టిన ఇద్దరు పిల్లలు మొత్తం మూడు కిలోల బరువు ఉన్నారని తెలిపారు. వారిని విడదీయగా […]

ఈ వైద్యులు చేసిన ఆపరేషన్ చూస్తే... చేతులెత్తి మొక్కాల్సిందే...
Follow us

| Edited By:

Updated on: Jan 28, 2020 | 10:41 AM

“వైద్యో నారాయణో హరి:” అంటారు పెద్దలు. అత్యవసర సమయాల్లో రోగి బంధువులకు డాక్టరే దేవుడిలా కనిపిస్తాడు. ఇది ముమ్మాటికి నిజం. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ తల్లి అవిభక్త కవలలకు జన్మనిచ్చింది. ఉదరం, పొట్ట అతుక్కుని పుట్టిన కవల పిల్లలను జోధ్‌పూర్ ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్లు సర్జరీ చేసి సక్సెస్‌ఫుల్‌గా వేరు చేశారు. దాదాపు నాలుగు గంటలపాటు ఈ ఆపరేషన్ కొనసాగింది.

పుట్టిన ఇద్దరు పిల్లలు మొత్తం మూడు కిలోల బరువు ఉన్నారని తెలిపారు. వారిని విడదీయగా ఒక్కొక్కరు కిలొన్నర బరువు వరకు ఉన్నారని ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. ఇలాంటి అరుదైన ఆపరేషన్లు చేసేందుకు కనీసం మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని ఎయిమ్స్ హెచ్‌ఓడీ డాక్టర్ అరవింద్ సిన్హా వెల్లడించారు. అయితే ఇద్దరు కవలల్లో ఒకరి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నాయని.. బతికే అవకాశాలు కూడా తక్కువగా ఉండటంతో.. ఈ ఆపరేషన్ చేయాల్సి వచ్చిందన్నారు. లేనిపక్షంలో మరో పిల్లాడి ప్రాణానికి ముప్పు ఏర్పడుతుందని.. అందుకే త్వరగా ఆపరేషన్ చేశామన్నారు. ప్రస్తుతం వేరుచేసిన ఈ ఇద్దరు కవలలు వెంటిలేటర్‌పై ఉంచామన్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని డాక్టర్ సిన్హా వెల్లడించారు. కాగా, ఈ అరుదైన సర్జరీని ఉచితంగానే చేసినట్లు తెలిపారు.