అదృశ్యమైన బాంబు పేలుళ్ల సూత్రధారి అరెస్ట్!
1993 ముంబై సీరియల్ పేలుళ్ల కేసులో దోషి, పెరోల్ లో ఉండి కనిపించకుండా పోయిన 68 ఏళ్ల జలీస్ అన్సారీని కాన్పూర్‌లో అరెస్టు చేశారు. డాక్టర్ బాంబ్ అని పిలువబడే అన్సారీ కాన్పూర్‌లోని ఒక మసీదును వదిలి రైల్వే స్టేషన్‌కు వెళుతుండగా అతన్ని ఉత్తరప్రదేశ్ పోలీసుల ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బంధించినట్లు పోలీసులు తెలిపారు. “జలీస్ అన్సారీ మసీదు నుండి బయటకు వస్తున్నప్పుడు అరెస్టు చేయబడ్డాడు. అతన్ని లక్నోకు తీసుకువచ్చారు. ఇది యుపి పోలీసుల ఘనకార్యం” అని ఉత్తర […]

1993 ముంబై సీరియల్ పేలుళ్ల కేసులో దోషి, పెరోల్ లో ఉండి కనిపించకుండా పోయిన 68 ఏళ్ల జలీస్ అన్సారీని కాన్పూర్‌లో అరెస్టు చేశారు. డాక్టర్ బాంబ్ అని పిలువబడే అన్సారీ కాన్పూర్‌లోని ఒక మసీదును వదిలి రైల్వే స్టేషన్‌కు వెళుతుండగా అతన్ని ఉత్తరప్రదేశ్ పోలీసుల ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బంధించినట్లు పోలీసులు తెలిపారు.
“జలీస్ అన్సారీ మసీదు నుండి బయటకు వస్తున్నప్పుడు అరెస్టు చేయబడ్డాడు. అతన్ని లక్నోకు తీసుకువచ్చారు. ఇది యుపి పోలీసుల ఘనకార్యం” అని ఉత్తర ప్రదేశ్ టాప్ కాప్ ఓపి సింగ్ అన్నారు. ఎంబిబిఎస్ డిగ్రీ సాధించిన అన్సారీ, మొదట యుపికి చెందిన సంత్ కబీర్ నగర్ జిల్లాలో నివసించేవాడు. నేపాల్ మార్గం ద్వారా దేశం విడిచి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చని పోలీసులు తెలిపారు.
68 ఏళ్ల అన్సారీ జీవితకాల శిక్ష అనుభవిస్తున్నాడు. దేశవ్యాప్తంగా 50 కి పైగా బాంబు పేలుడు కేసులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అన్సారీ సిమి, ఇండియన్ ముజాహిదీన్ వంటి టెర్రర్ సంస్థలతో సంబంధం కలిగి ఉన్నారని, బాంబులను ఎలా తయారు చేయాలో ఉగ్రవాద గ్రూపులకు నేర్పించారని ఆరోపించారు. ముంబైలో 2008 బాంబు పేలుడుకు సంబంధించి 2011 లో జాతీయ దర్యాప్తు సంస్థ కూడా అతన్ని ప్రశ్నించింది.
పెరోల్ పై ఉన్నప్పుడు, ఆయన ప్రతిరోజూ ఉదయం 10.30 మరియు మధ్యాహ్నం 12 గంటల మధ్య అగ్రిపాడ పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని ఆదేశించారు పోలీసులు. అయితే, అన్సారీ గురువారం పోలీస్‌స్టేషన్ కు వెళ్ళలేదు. అతని కుమారుడు తరువాత పోలీసులకు తప్పిపోయినట్టు ఫిర్యాదు చేసాడు. దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్, మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ అన్సారీ కోసం వేట ప్రారంభించి అరెస్టు చేశారు.



