బల్బులకి బ్యాక్టీరియాను చంపే సీనుందా?

సిస్కా గ్రూప్ కంపెనీ సిస్కా బ్యాక్టీగ్లో పేరుతో SSK-BAB-9W Anti-Bacterial LED బల్బును మార్కెట్లోకి తీసుకొచ్చింది. మైక్రోబయాల్ డిసిన్ఫెకషన్ లక్షణాలను కలిగి, కరెంట్ ద్వారా గదిలోని హానికరమైన బాక్టీరియాను నశింపచేసే సరికొత్త టెక్నాలజీ ఈ బల్బులో ఉంటుంది.. ఈ బల్బు, 400nm నుండి 420nm వేవ్ లెంత్ విడుదల చేస్తుంది. ఇది మానవ కంటికి కనబడక పోయినప్పటికీ, వేవ్ లెంగ్త్ రూపంలో పనిచేస్తుంది. ఇండోర్ లేదా క్లోస్డ్ అవసరాల కోసం ఈ బల్బ్ రూపొందించబడింది. ఈ వేవ్ […]

బల్బులకి బ్యాక్టీరియాను చంపే సీనుందా?
Follow us
Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Nov 16, 2019 | 6:57 PM

సిస్కా గ్రూప్ కంపెనీ సిస్కా బ్యాక్టీగ్లో పేరుతో SSK-BAB-9W Anti-Bacterial LED బల్బును మార్కెట్లోకి తీసుకొచ్చింది. మైక్రోబయాల్ డిసిన్ఫెకషన్ లక్షణాలను కలిగి, కరెంట్ ద్వారా గదిలోని హానికరమైన బాక్టీరియాను నశింపచేసే సరికొత్త టెక్నాలజీ ఈ బల్బులో ఉంటుంది.. ఈ బల్బు, 400nm నుండి 420nm వేవ్ లెంత్ విడుదల చేస్తుంది. ఇది మానవ కంటికి కనబడక పోయినప్పటికీ, వేవ్ లెంగ్త్ రూపంలో పనిచేస్తుంది. ఇండోర్ లేదా క్లోస్డ్ అవసరాల కోసం ఈ బల్బ్ రూపొందించబడింది.

ఈ వేవ్ లెంత్ వల్ల మనుషులకు ఎటువంటి హాని కలిగదు. హానికరమైన బాక్టీరియాను ఎదుర్కోవడానికి, వాటిని విస్తరించకుండా నిరోధించడానికి మాత్రమే ఉపయోగపడుతుందని చెబుతున్నారు సిస్కా సంస్థ ప్రతినిధులు . ఇప్పటికే LED లైట్ టెక్నాలజీలో ప్రాచుర్యం పొందిన సిస్కా, ఇప్పుడు ఈ బ్యాక్టీగ్లో LED బల్బ్‌ను 2-ఇన్-1 మోడ్ తో అందుబాటులోకి తీసుకువచ్చింది . ఇందులో లైటింగ్ ప్లస్ యాంటీ-బ్యాక్టీరియల్ మోడ్ లేదా కేవలం యాంటీ బ్యాక్టీరియల్ మోడ్ ని ఎంచుకునే ఆప్షన్ తో వస్తుంది. ఈ ప్రత్యేకమైన, యాంటీ-బ్యాక్టీరియల్ బల్బ్ ధర కేవలం 250/- రుపాయలుగా నిర్ణయించబడింది. ఆన్లైన్ షాపింగ్ సైట్స్ లేదా అన్నీ ప్రధానమైన రిటైల్ స్టోర్లలో ఈ బల్బులు లభించనున్నాయి.. వీటికి 1 ఇయర్ వారంటీ కూడాఉండటం విశేషం.