AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరివేపాకుతో తస్మాత్ జాగ్రత్త..!

పప్పు, కూర,చారు ఇలా ఇంట్లో ఏ వంట చేసినా కరివేపాకు లేనిదే ఆ వంటకి రుచి రాదు.. టేస్ట్ కోసం కాకపోయినా కరివేపాకులో ఉండే పోషకాల కోసమయినా దాన్ని వంటల్లో వేసేవారు చాలా మందే ఉంటారు. కరివేపాకులో శరీరానికి ఎంతో అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లూ, బి విటమిన్, కెరోటిన్ పుష్కలంగా ఉండటమే కాదు.. తాజా కరివేపాకు నుంచి ప్రొటీన్లు, కొవ్వు పదార్ధాలు, పిండి పదార్ధాలు, పీచు పదార్ధాలు, క్యాలరీలు కూడా పుష్కలంగా లభిస్తాయి. […]

కరివేపాకుతో తస్మాత్ జాగ్రత్త..!
Anil kumar poka
| Edited By: |

Updated on: Nov 16, 2019 | 6:37 PM

Share

పప్పు, కూర,చారు ఇలా ఇంట్లో ఏ వంట చేసినా కరివేపాకు లేనిదే ఆ వంటకి రుచి రాదు.. టేస్ట్ కోసం కాకపోయినా కరివేపాకులో ఉండే పోషకాల కోసమయినా దాన్ని వంటల్లో వేసేవారు చాలా మందే ఉంటారు. కరివేపాకులో శరీరానికి ఎంతో అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లూ, బి విటమిన్, కెరోటిన్ పుష్కలంగా ఉండటమే కాదు.. తాజా కరివేపాకు నుంచి ప్రొటీన్లు, కొవ్వు పదార్ధాలు, పిండి పదార్ధాలు, పీచు పదార్ధాలు, క్యాలరీలు కూడా పుష్కలంగా లభిస్తాయి.

కరివేపాకులో పౌష్టిక విలువలు మాత్రమే కాదు.. ఔషధ గుణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. షుగర్ వ్యాధిగ్రస్తులకు కరివేపాకు చాలా మేలు చేస్తుందంటారు. ఇందులోని కొయినిజన్ వంటి కొన్ని కెమికల్స్ డయాబెటిక్ పేషెంట్లకి చాలా అవసరం అంటారు నిపుణులు. అంతేకాదు జన్యుపరంగా లేదా స్థూలకాయం కారణంగా వచ్చే మధుమేహాన్ని కరివేపాకు ద్వారా అరికట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇటు ఆరోగ్యానికే కాదు.. సౌందర్యానికీ కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. కరివేపాకు వేసి కాచిన నూనెను తలకి మర్ధన చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా మెరుస్తాయి. కరివేపాకును రోజూ ఆహారంలో తీసుకుంటే జుట్టు రాలిపోకుండా చేస్తుంది.

ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ మనం తీసుకునే కరివేపాకులో విషం తాలూకు అవశేషాలు చాలానే ఉన్నాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్ద పరిశీలనలో తేలింది. కరివేపాకు మాత్రమే కాదు, మనం నిత్యం వాడే కూరగాయలు, పండ్లలో కూడా వీటి శాతం చాలానే ఉందని ఈ పరిశీలనలో తేలింది. మొత్తంగా 23వేల 660 నమూనాలు సేకరించి విశ్లేషించిగా అందులో 4 వేల 510 నమూనాల్లో పురుగు మందుల అవశేషాలు కనిపించాయని ఈ పరిశోధన సారాంశం తెలిపింది. అంటే మనం రోజూ తినే ఆహారంలో 19.1 శాతం తిండి పదార్థాల్లో విషపు అవశేషాలు ఉన్నట్టు లెక్క.

ఎంతసేపూ కూరగాయలనే కాకుండా ఈ సారి మన దేశంలో రోజూవారీగా ఎక్కువగా వినియోగించే కరివేపాకును పరిశీలించారు పరిశోధకులు.. దీని కోసం కరివేపాకుకు సంబంధించి 616 నమూనాలను సేకరించి, పరిశోధించగా అందులో సగానికంటే ఎక్కువగానే, 438 నమూనాల్లో పురుగు మందుల అవశేషాలను కనుగొన్నారు. అంటే మనం తినే కరివేపాకులో 50శాతంపైగా విషపూరితమైన ఆకులే ఉన్నాయన్న మాట. దీంతో కరివేపాకు చేసే మేలుకంటే దాని వల్ల కలిగే నష్టాలే ఎక్కువ అంటూ తేలిపోయింది. కూరల్లో వేసేముందు కరివేపాకును బాగా కడగటం, బయట ఎక్కడో వీటిని కొనడం కంటే ఇంట్లోనే కెమికల్స్ వాడకుండా పెంచిన కరివేపాకు తినడం వల్ల కాస్త మేలు జరిగే అవకాశం ఉంటుందన్నారు నిపుణులు.