గుంటూరులో కలెక్టర్ వర్సెస్ డాక్టర్

Guntur Collector Vs Medical Officer : గుంటూరు జిల్లా నరసరావుపేటలో కలెక్టర్‌కే షాకిచ్చాడు ఓ వైద్యాధికారి. నరసరావుపేటలో కరోనాపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్‌లో వైద్య సిబ్బంది పనితీరుపై కలెక్టర్‌ శామ్యూల్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్‌ తీరుపై నాదెండ్ల వైద్యాధికారి సోమ్లానాయక్‌ అభ్యంతరం వ్యక్తం చేశాడు. సమావేశంలో కలెక్టర్‌, వైద్యాధికారి మధ్య వాగ్వాదం చెలరేగింది. జిల్లాలో కరోనా టెస్టులపై చర్చ జరిగింది. వైద్యులు చెబుతున్న విషయాలపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ […]

గుంటూరులో కలెక్టర్ వర్సెస్ డాక్టర్
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 10, 2020 | 8:14 PM

Guntur Collector Vs Medical Officer : గుంటూరు జిల్లా నరసరావుపేటలో కలెక్టర్‌కే షాకిచ్చాడు ఓ వైద్యాధికారి. నరసరావుపేటలో కరోనాపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్‌లో వైద్య సిబ్బంది పనితీరుపై కలెక్టర్‌ శామ్యూల్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

కలెక్టర్‌ తీరుపై నాదెండ్ల వైద్యాధికారి సోమ్లానాయక్‌ అభ్యంతరం వ్యక్తం చేశాడు. సమావేశంలో కలెక్టర్‌, వైద్యాధికారి మధ్య వాగ్వాదం చెలరేగింది. జిల్లాలో కరోనా టెస్టులపై చర్చ జరిగింది. వైద్యులు చెబుతున్న విషయాలపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ తో వైద్యాధికారికి మధ్య మాట మాట పెరిగింది. ప్రశ్నించడానికి మీరెవరంటూ కలెక్టర్‌పైనే మండిపడ్డాడు వైద్యాధికారి సోమ్లానాయక్‌.

దీంతో ఖంగుతిన్న కలెక్టర్‌ శామ్యూల్‌… వైద్యాధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తననే నువ్వెవరంటూ ప్రశ్నించడంపై మండిపడ్డారు. వైద్యాధికారి సోమ్లానాయక్‌ను అరెస్ట్‌ చేయాలని పోలీసులను ఆదేశించారు. సోమ్లానాయక్‌ను సస్పెండ్‌ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు.