ఐపీఎల్ యాంకర్ నేహా చౌదరికి దర్శకేంద్రుడి బ్లెస్సింగ్స్

ఐపీఎల్ లో సరికొత్త అవతారం ఎత్తబోతున్న బుల్లితెర యాంకర్ నేహా చౌదరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు. 'జిమ్నాస్టిక్స్ లో ఎన్నో మెడల్స్ సాధించావు..

ఐపీఎల్ యాంకర్ నేహా చౌదరికి దర్శకేంద్రుడి బ్లెస్సింగ్స్
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Sep 11, 2020 | 6:33 PM

ఐపీఎల్ లో సరికొత్త అవతారం ఎత్తబోతున్న బుల్లితెర యాంకర్ నేహా చౌదరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు. ‘జిమ్నాస్టిక్స్ లో ఎన్నో మెడల్స్ సాధించావు.. రాబోయే ఐపీఎల్ తో నీ యాంకరింగ్ ద్వారా తెలుగు వారందరికీ మరింత దగ్గరవ్వాలని ఆశీర్వదిస్తున్నాను’. అంటూ రాఘవేంద్రరావు ఆమెను బ్లెస్ చేశారు. క్రీడా నేపథ్యం నుంచి వచ్చి తెలుగు బుల్లితెర యాంకర్ గా పేరు సంపాదించుకున్న నేహా చౌదరి ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ (ఐపీఎల్)లో యాంకరింగ్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా తెలుగులోనూ క్రికెట్ కామెంటరీ వినిపిస్తున్న ఐపీఎల్ ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ తెలుగు బృందంలో నేహాకు కూడా చోటుదక్కింది. నేహా చౌదరి రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో జాతీయ స్థాయి చాంపియన్ కూడా. వినోద రంగంపై ఆసక్తితో ఆమె యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. ఇప్పుడు ఆమె ప్రతిభకు తగ్గట్టుగానే కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ కూడా ఆమెకు స్వాగతం పలికింది. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు దుబాయ్ లో జరుగబోతున్న ఐపీఎల్ క్రికెట్ పోటీలు స్టార్ స్పోర్ట్స్ లో ప్రసారం కానున్నాయి.