చంద్రబాబు ఇచ్చిన ఛలో ఆత్మకూర్ పిలుపు సక్సెస్ అయిందా..?
వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ చలో ఆత్మకూర్ అంటూ చంద్రబాబు ఇచ్చిన పిలుపు ఎంతవరకు సక్సెస్ అయింది. చంద్రబాబు పిలుపు మేరకు టీడీపీ నేతలు ఆందోళనలు, నిరసనలు చేసేందుకు భారీగానే తరలివచ్చారు. కాని టీడీపీ దూకుడుకు పోలీస్ బాస్‌లు బ్రేక్ వేశారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేశారు. టీడీపీ నేతలనే కాదు.. వైసీపీ నేతలను కూడా అరెస్టు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుకుండా ఇరుపార్టీల నేతలను అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు, నారాలోకేష్‌లను […]
వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ చలో ఆత్మకూర్ అంటూ చంద్రబాబు ఇచ్చిన పిలుపు ఎంతవరకు సక్సెస్ అయింది. చంద్రబాబు పిలుపు మేరకు టీడీపీ నేతలు ఆందోళనలు, నిరసనలు చేసేందుకు భారీగానే తరలివచ్చారు. కాని టీడీపీ దూకుడుకు పోలీస్ బాస్‌లు బ్రేక్ వేశారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేశారు.
టీడీపీ నేతలనే కాదు.. వైసీపీ నేతలను కూడా అరెస్టు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుకుండా ఇరుపార్టీల నేతలను అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు, నారాలోకేష్‌లను 24 గంటల పాటు హౌస్ అరెస్టు చేశారు. అయినప్పటికీ తాను ఆత్మకూరు వెళ్లి తీరుతానని చంద్రబాబు నిరాహార దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మకూరులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులకు పాల్పడిందని చంద్రబాబు ఆరోపించారు. ఎస్సీ కుటుంబాలకు చెందిన వారి పట్ల దారుణంగా వ్యవహరించారని అన్నారు. వైసీపీ దాడులకు గురైన బాధితులను గ్రామాల్లోకి తిరిగి తీసుకొచ్చేందుకే ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు ఆయన చెప్పుకొచ్చారు. నేతలందరినీ పిలిచి వైసీపీ సర్కార్ పై బురద చల్లే ప్రయత్నం చేశారు. జగన్ సర్కార్ వల్ల ప్రజలకు న్యాయం జరగదని.. తాము ప్రజలకు అండగా ఉంటామని చెప్పే ప్రయత్నం చేశారు.
అయితే టీడీపీ ఆరోపణల్లో వాస్తవం లేదని వైసీపీ నేతలు మండిపడ్డారు. పల్నాడు ప్రాంతం ప్రశాంతంగా ఉంటే టీడీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని ప్రతివిమర్శలకు దిగారు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమి లేదని అన్నారు. పల్నాడు పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. అంతేకాదు ఆందోళన చేయడానికని వెళ్లిన పలువురు టీడీపీ నేతలు పోలీసులపై ఇష్టం వచ్చినట్లు నోరుపారేసుకున్నారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్‌ని పట్టుకుని యూస్ లెస్ ఫెలో అని తిట్టారు. ఇక నన్నపనేని రాజకుమారిని అడ్డుకునేందుకు ప్రయత్నించి ఓ మహిళా ఎస్పై పై చిందులు తొక్కారు.
ఇదిలా వుంటే చంద్రబాబేమో ఏపీతో పాటు తెలంగాణలో కూడా టీడీపీని బలోపేతం చేస్తానని అన్నారు. తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీని తీసుకొస్తానని చెప్పారు. కాని టీడీపీ నేతలు చేసిన నాటకాలను ప్రజలు నమ్మరని వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేంగా పోరాటం చేయడానికి వెళ్లి టీడీపీ నేతలు నవ్వుల పాలు అయ్యారని వారు ఆరోపించారు. దీనిని బట్టి చంద్రబాబు చలో ఆత్మకూరు పిలుపు విజయవంతం కాలేదని తెలుస్తోంది.