బడ్జెట్‌ 2019: ఏపీకి మరీ ఇంత అన్యాయమా..!

దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కేంద్రం నుంచి ఏపీకి నిధులు చాలా అవసరం. ఐదు సంవత్సరాల క్రితం తెలంగాణ నుంచి విడిపోయిన ఏపీకి ఏడాదేడాదికి లోటు బడ్జెట్‌ పెరుగుతూనే ఉంది. పలు సమస్యలతో ఇబ్బందులు పడుతోన్న ఏపీకి రాజధాని, పోలవరం, విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్ట్‌లు, విశాఖపట్నం పోర్టు.. ఇలా పలు అంశాల్లో కేంద్రం నుంచి వేల కోట్ల నిధులు అవసరం. దీంతో ఈ బడ్జెట్‌పై ఏపీ ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు ఏపీ ప్రజలు. […]

బడ్జెట్‌ 2019: ఏపీకి మరీ ఇంత అన్యాయమా..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 06, 2019 | 4:00 PM

దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కేంద్రం నుంచి ఏపీకి నిధులు చాలా అవసరం. ఐదు సంవత్సరాల క్రితం తెలంగాణ నుంచి విడిపోయిన ఏపీకి ఏడాదేడాదికి లోటు బడ్జెట్‌ పెరుగుతూనే ఉంది. పలు సమస్యలతో ఇబ్బందులు పడుతోన్న ఏపీకి రాజధాని, పోలవరం, విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్ట్‌లు, విశాఖపట్నం పోర్టు.. ఇలా పలు అంశాల్లో కేంద్రం నుంచి వేల కోట్ల నిధులు అవసరం. దీంతో ఈ బడ్జెట్‌పై ఏపీ ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు ఏపీ ప్రజలు. మరోవైపు ఈ ఎన్నికల్లో విజయం సాధించి మొదటిసారిగా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ కూడా ఈ బడ్జెట్‌ వైపు ఆశగా చూశారు.

ఈ క్రమంలో ఎన్నికల్లో గెలిచిన తరువాత, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రెండుసార్లు మోదీని కలిసిన జగన్.. రాష్ట్ర ఆర్థిక లోటు, ప్రత్యేక హోదాపై విన్నవించారు. ఆ సమయంలో ఏపీకి మా పూర్తి సహకారం ఉంటుందని ఎప్పటిలాగే చెప్పిన మోదీ.. బడ్జెట్‌లో మాత్రం ఏ రకంగానూ కేటాయింపులు చూపలేదు. ఇక ఏపీ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రత్యేక హోదాపై శుక్రవారం నాటి బడ్జెట్ ప్రసంగంలో కనీసం చిన్న మాట కూడా మాట్లాడలేదు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

కేంద్రానికి ఏపీ ఇచ్చిన నివేదికలో కీలక అంశాలు ఏంటేంటే.. ఏపీలో అధికారం చేపట్టిన తరువాత వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి కావాల్సిన నిధులపై ప్రతిపాదనలు పంపింది. అందులో ఏపీకి రెవెన్యూ లోటు భర్తీ, దుగరాజపట్నం పోర్టు, కడపలో స్టీలు ప్లాంట్, విశాఖపట్నంలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం, వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్‌లను ప్రస్తావించారు. వీటితో పాటు ప్రత్యేక హోదాపై కూడా ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని తమ విన్నపాన్ని చేసింది. అయితే వీటిలో దేని గురించి నిర్మలా సీతారామన్ ప్రస్తావించలేదు.

ఏపీకి మొత్తం ఎంత కేటాయించారంటే.. శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు లేవు. కనీసం ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు సైతం బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. వీటతో పాటు రాజధాని అమరావతి నిర్మాణంపై కూడా ఊసు లేదు. అయితే జాతీయ విద్యా సంస్థలకు మాత్రం నామమాత్రంగా విదిలింపులు చేశారు. దీంతో మొత్తంగా ఏపీకి దక్కేది నికరంగా రూ.34.83కోట్లు మాత్రమే. అది కూడా పన్నుల ద్వారా మాత్రమే.

సర్వత్రా విమర్శలు కాగా ఏపీకి కేంద్రం మొండిచూపడంపై అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. ఈ బడ్జెట్ చాలా నిరాశకు గురి చేసింది. కేంద్రం నుంచి ఏపీకి వచ్చిందేది లేదంటూ వైసీపీ పార్లమెంటరీ లీడర్ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన హామీలను ఏ మాత్రం నెరవేర్చలేదు. ఏపీకి రావాల్సిన నిధులపై రానున్న లోక్‌సభ సమావేశాల్లో మా పార్టీ ఎంపీలు పోరాడుతారు అంటూ లోక్‌సభ ఫ్లోర్ లీడర్, ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరోవైపు ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కూడా ఈ బడ్జెట్‌పై నిరాశను వ్యక్తపరిచారు. ఏపీపై ఇప్పటికీ కేంద్రం చిన్నచూపు కొనసాగుతూనే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..