తీవ్రవాయుగుండంగా మారే ఛాన్స్.. మరో మూడు రోజులు విస్తారంగా వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడి తీవ్రవాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణశాఖ తెలిపింది. ఇది నర్సాపురం-విశాఖ మధ్య రేపు రాత్రికి తీరం దాటే

  • Sanjay Kasula
  • Publish Date - 10:02 pm, Sun, 11 October 20
తీవ్రవాయుగుండంగా మారే ఛాన్స్.. మరో మూడు రోజులు విస్తారంగా వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడి తీవ్రవాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణశాఖ తెలిపింది. ఇది నర్సాపురం-విశాఖ మధ్య రేపు రాత్రికి తీరం దాటే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు, మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది.

ఆ సమయంలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావారణ శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

కోనసీమలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తీర ప్రాంత వాసులను అప్రమత్తం చేశారు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లొద్దని ఆదేశించారు అధికారులు.