ఎక్కడయ్యా చినుకు..? అన్నదాత ఎదురు చూపు..!
చినుకు రాల లేదు.. విత్తు విత్తలేదు. పాతాళంలో జలాలు.. ఎండిపోతోన్న పొలాలు.. ఇదీ మహబూబ్‌నగర్ జిల్లాలోని రైతుల పరిస్థితి. రబీ సీజన్‌లో సాగుకు నీరు లేక వందలాది ఎకరాల్లో పంట ఎండిపోయింది. జనం గుక్కెడు నీళ్లకోసం తహతహలాడిపోతున్నారు. 32 మండలాల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ఇటు ప్రాజెక్టుల్లోని నీరు డెడ్ స్టోరేజీకి చేరింది. జూన్ చివరికి వచ్చినా.. వర్షాలు పడకపోవడంతో రైతన్నలు వరుణుడికోసం ఎదురు చూస్తున్నారు. వర్షాకాలం ప్రారంభంలో కాస్త మురిపించిన వర్షాలు.. ఇప్పుడు […]

చినుకు రాల లేదు.. విత్తు విత్తలేదు. పాతాళంలో జలాలు.. ఎండిపోతోన్న పొలాలు.. ఇదీ మహబూబ్‌నగర్ జిల్లాలోని రైతుల పరిస్థితి. రబీ సీజన్‌లో సాగుకు నీరు లేక వందలాది ఎకరాల్లో పంట ఎండిపోయింది. జనం గుక్కెడు నీళ్లకోసం తహతహలాడిపోతున్నారు. 32 మండలాల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ఇటు ప్రాజెక్టుల్లోని నీరు డెడ్ స్టోరేజీకి చేరింది. జూన్ చివరికి వచ్చినా.. వర్షాలు పడకపోవడంతో రైతన్నలు వరుణుడికోసం ఎదురు చూస్తున్నారు.
వర్షాకాలం ప్రారంభంలో కాస్త మురిపించిన వర్షాలు.. ఇప్పుడు పూర్తిగా ముఖం చాటేశాయి. గత ఏడేళ్లుగా జిల్లాలో ఇదే పరిస్థితి కనిపిస్తోందని స్థానిక రైతులు వాపోతున్నారు. బోరు బావులు పూర్తిగా ఎండిపోయి.. పత్తి, మొక్కజొన్న, ఆముదం, కంది పంటలు వేయాలంటే వర్షాలు పడితే కానీ సాధ్యం కాదని రైతులు అంటున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా మూడు వేల హెక్టార్లలో పంట పూర్తిగా ఎండిపోయింది. ఇంకేం చేయాలో పాలుపోని పరిస్థితిలో భూములను చదును చేసి, వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు రైతులు.