ప్రాణం తీసిన పబ్జీ గేమ్..
ఇప్పుడు అందరిచేతుల్లోనూ సెల్ ఫోన్లు ఉంటున్నాయి. ఏ కొత్తవి వచ్చినా ఏముందని డన్లోడ్ చేసి ఆడేస్తున్నారు. అలా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన గేమ్ పబ్జీ. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఈ గేమ్‌కి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఆడవద్దు అని మందలించిన పాపానికి.. ఓ డిగ్రీ విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. సరదాగా మొదలైన ఈ పబ్జీ గేమ్ ప్రాణాలమీదకి తెచ్చింది. తల్లి మందలించిందన్న మనస్తాపంతో డిగ్రీ విద్యార్థి సాయి శరణ్ (18) ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ జిల్లా […]
ఇప్పుడు అందరిచేతుల్లోనూ సెల్ ఫోన్లు ఉంటున్నాయి. ఏ కొత్తవి వచ్చినా ఏముందని డన్లోడ్ చేసి ఆడేస్తున్నారు. అలా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన గేమ్ పబ్జీ. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఈ గేమ్‌కి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఆడవద్దు అని మందలించిన పాపానికి.. ఓ డిగ్రీ విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు.
సరదాగా మొదలైన ఈ పబ్జీ గేమ్ ప్రాణాలమీదకి తెచ్చింది. తల్లి మందలించిందన్న మనస్తాపంతో డిగ్రీ విద్యార్థి సాయి శరణ్ (18) ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ జిల్లా మల్లారం గ్రామానికి చెందిన వెంకట నారాయణ కుటుంబం గజ్వేల్ పట్టణంలో స్థిరపడ్డారు. వాళ్ల చిన్న కుమారుడు సాయి శరణ్ రోజూ అదేపనిగా పబ్జీ ఆడుతూ ఉండేవాడు. అయితే.. గమనించిన తల్లి మందలించింది. దీంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన సాయి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు.