భారతీయులు ఇలా ఖర్చు పెడుతున్నారా?
ఖర్చు చేసేదానిలో భారతీయులు మిగతా ప్రపంచానికి భిన్నంగా ఉంటారు. ఒక సర్వేలో భారతీయుల ఖర్చు అలవాట్లపై ఆరా తీశారు. మహిళల కంటే మగవారు బట్టలపై తక్కువ ఖర్చు చేస్తారని…. యువత కంటే ఎక్కువగా మధ్య వయసు గ్రూపు ఫ్యాషన్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇంకా ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలను తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే భారతీయులు దేనికోసం ఖర్చు చేస్తారు? 30 శాతం కంటే ఎక్కువ మంది తాము విహార యాత్రలు లేదా హాలిడేయింగ్ […]
ఖర్చు చేసేదానిలో భారతీయులు మిగతా ప్రపంచానికి భిన్నంగా ఉంటారు. ఒక సర్వేలో భారతీయుల ఖర్చు అలవాట్లపై ఆరా తీశారు. మహిళల కంటే మగవారు బట్టలపై తక్కువ ఖర్చు చేస్తారని…. యువత కంటే ఎక్కువగా మధ్య వయసు గ్రూపు ఫ్యాషన్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇంకా ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలను తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే
భారతీయులు దేనికోసం ఖర్చు చేస్తారు?
30 శాతం కంటే ఎక్కువ మంది తాము విహార యాత్రలు లేదా హాలిడేయింగ్ కోసం ఖర్చు చేయలేమని చెప్పారు. * 1960,70ల్లో పుట్టిన వారు ఎక్కువగా విహార యాత్రలపై ఖర్చుపెడుతున్నట్లు తెలిపారు. 25 శాతం మంది రూ. 1లక్షా 20 వేల కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. * దేశంలో సగం మంది జనాభా ప్రతి నెలా బట్టల కోసం రూ. 500 నుంచి రూ. 2500 వెచ్చిస్తున్నట్లు తెలిసింది. * రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారిలో 75% మంది నెలకు రూ. 1550 లేదా అంతకంటే ఎక్కువ డబ్బును దుస్తులు కొనేందుకు ఉపయోగిస్తున్నారు. * పాదరక్షల కోసం రూ. 3000 లేదా అంతకంటే ఎక్కువ డబ్బును వెచ్చిస్తున్న వారిలో మగవారి శాతం 16% ఉండగా; ఆడవాళ్ల శాతం 21% ఉన్నట్లు సర్వేలో బయటపడింది. * బయట హోటళ్లు,రెస్టారెంట్లలో తినడం ఆదాయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మధ్య భారతదేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు తాము బయట తినేంత స్థాయి తమకు లేదని తెలుపగా; పశ్చిమ భారతదేశంలో ప్రతి పది మందిలో ఒకరుగా ఉంది. అంటే పశ్చిమ భారతదేశంతో పోలిస్తే మధ్య భారతం అంత సులువుగా తిండిపై ఎక్కువ ఖర్చు పెట్టేందుకు సిద్దంగా లేదు. * డేటింగ్ కోసం 16% మహిళలు 3000 కంటే ఎక్కువ ఖర్చుపెడతామని చెప్పగా, మగవారిలో ఇది 14% ఉంది. * విడాకులు తీసుకున్న భారతీయుల్లో రూ. 3000 పైన ఖర్చు చేసే వారి శాతం 38% గా ఉంది. ఈ డబ్బును ఒంటరిగా ఉంటున్న(పెళ్లి కాని, చేసుకోని) వారిలో 10 శాతం మంది ఖర్చు చేస్తున్నారు.
ఆన్‌లైన్ షాపింగ్
* ఆన్‌లైన్ షాపింగ్‌పై 70% భారతీయులు (నెలకు) రూ. 1990 కంటే తక్కువ ఖర్చు చేస్తున్నారు. * ఆన్‌లైన్ షాపింగ్ కోసం ఉత్తర భారతీయులు మరే ఇతర ప్రాంతంతో పోల్చినా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ప్రతి నెలా రూ. 1990 కంటే ఎక్కువగా 37% మంది స్పెండ్ చేసే అలావాటు కలిగి ఉన్నారు. * మిలీనియం సంవత్సరం తర్వాత పుట్టిన వారిలో 80% మంది రూ. 1990 కంటే తక్కువ ఆన్‌లైన్ షాపింగ్ కోసం కేటాయిస్తున్నారు. * సమయాన్ని ఆదా చేసుకునేందుకే ఆన్‌లైన్ షాపింగ్‌కు మొగ్గుచూపుతున్నట్లు ఎక్కువ మంది తెలిపారు.
భారతీయుల ఖర్చుల అలవాట్లు
* బ్యాంకు పొదుపు ఖాతాలో కానీ అత్యవసర నిధిగా కానీ రూ. 5000 కంటే తక్కువ పొదుపు చేస్తున్న వారి శాతం 57% గా ఉంది. ఇది దీర్ఘకాలంలో ప్రమాదకరమే. * పెద్దవారిలో 54% మంది రూ. 50 వేల కంటే ఎక్కువ పొదుపు ఖాతాలో సేవ్ చేసుకుంటున్నారు. * సగటు భారతీయుడి పరంగా రూ. 50 వేల కంటే ఎక్కువ పొదుపు ఖాతాలో కలిగి ఉన్న వారి శాతాన్ని చూస్తే 16శాతంగా ఉంది. ఇది నిరాశ కలిగించే అంశం. * పెళ్లయిన భారతీయులు ఎక్కువ పొదుపు చేస్తున్నారు. వారిలో 35% మంది రూ. 50 వేల కంటే ఎక్కువ డబ్బును అత్యవసర నిధిగా ఉంచుకుంటున్నారు. * 30 శాతం మంది భారతీయులకు నెల నెలా పెట్టుబడులు పెట్టే అలవాటే లేదు. * 50 శాతం మంది భారతీయులు ఆర్థిక విషయాల్లో కుటుంబానికి అండగా నిలుస్తున్నారు.
అప్పులు లేదా క్రెడిట్ కార్డుల అలవాట్లు * 70 ఏళ్ల పైన వయసు ఉన్నవారిలో 23% మంది ఎక్కువ డబ్బును(55%) అద్దె లేదా ఇంటి అప్పు తీర్చడం కోసం వినియోగిస్తున్నారు. * 70% తూర్పు భారతీయులు తమ ఆదాయంలో 10% కంటే తక్కువ డబ్బును ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. * 65% మంది కాలేజీ, హైస్కూల్ విద్యార్థులు అద్దె లేదా ఇంటి అప్పు తీర్చడం కోసం 10% కంటే తక్కువ ఆదాయాన్ని వెచ్చిస్తున్నామని అన్నారు. * మధ్య వయసు వారిలో ఎక్కువ శాతం మంది(70%) క్రెడిట్ కార్డు ఉందని చెప్పారు. ప్రస్తుత తరంలో ఇది 55% ఉండగా, పాత తరంలో ఇది 45%గా ఉంది. * క్రెడిట్ కార్డు మీద మధ్య భారతదేశానికి చెందిన ప్రజలు అనాసక్తి కలిగి ఉండగా, ఈశాన్య భారత ప్రజలు క్రెడిట్ కార్డుపై మక్కువ కలిగి ఉన్నారు. * దేశంలో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు క్రెడిట్ కార్డు సదుపాయాన్ని కల్పించడం లేదు. * ఎటువంటి క్వాలిఫికేషన్ లేని వారిలో 65% మంది వద్ద క్రెడిట్ కార్డులు ఉండటం విశేషం.
ఫ్యాషన్ షాపింగ్
యువతే ఎక్కువ ఫ్యాషన్ ఆరాటప్రియులనే ముద్ర ఉన్నా మన దేశంలో 35 నుంచి 44 మధ్య వయసు ఉన్నవారు ఎక్కువ ఫ్యాషన్ కోసం ఖర్చు పెడుతున్నారు. వారంతా 22% మంది ప్రతి నెలా రూ. 2500 కంటే ఎక్కువ బట్టలూ కొంటూ తమ వార్డ్‌రోబ్‌ను నింపేస్తున్నారు. లేటెస్ట్ ట్రెండ్‌లపై వీరికి మోజు ఎక్కువ. ఒక్కోసారి సంపాదనలో మూడో వంతు దీనికే పోతుందంటే దుస్తులపైన ఉన్న ఆరాటాన్ని అర్థం చేసుకోవచ్చు. అతే సమయంలో ఫుట్ వేర్ పైన ఎక్కువ ఖర్చుపెట్టేందుకు చాలా మంది సిద్దంగా లేరు. కొత్త షూల పైన దాదాపు రూ. 1000 ఖర్చు పెట్టేందుకు ఎక్కువ శాతం మంది సుముఖంగా ఉన్నారు. 56% మంది రూ. 1000 కంటే తక్కువ, 26% మంది రూ. 1000 నుంచి రూ. 8000 మధ్య , 5% మంది రూ. 8000 కంటే ఎక్కువ ఖర్చుపెడుతున్నట్లు చెప్పారు.
బయట తినే అలవాటు
బయట తినేందుకు ఖర్చు పెట్టే విషయానికొస్తే మనోళ్లు కాస్త నెమ్మదిస్తున్నారనే చెప్పాలి. 22% మంది యువత తరుచూ బయట తినేందుకు మొగ్గుచూపమని చెప్పారు. ఎందుకంటే అంత డబ్బు ఖర్చుపెట్టే స్తోమత వారికి లేదట. 35 నుంచి 44 ఏళ్ల వయసు గ్రూపలో 14% మంది మాత్రమే తరుచూ బయట తినేందుకు వెళ్లమని చెప్పారు. అంటే ఆ వయసు గ్రూపులో ఎక్కువ మంది బయట తినేందుకు మొగ్గుచూపుతున్నారు. ఎందుకంటే సంపాదన సామర్థ్యం బాగుంటుంది కాబట్టి. రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఆర్జిస్తున్న వారిలో 15% మంది తాము రోజు బయటే తింటామని చెప్పారు. ఇక్కడ బయట అంటే రెస్టారెంట్లు, హోటళ్లగా పరిగణించాలి.