16,000 అద్దె చెల్లించేందుకు రెడీ

ఇంటి అద్దెలు బాగా పెరిగిపోతున్నా కూడా మెట్రో నగరాల్లో అద్దె ఇళ్లకు ఫుల్ డిమాండ్ ఉంది. నెలకు సగటున రూ.16,000 వరకు చెల్లించేందుకు ఉద్యోగులు రెడీ అవుతున్నారు. మరోవైపు విద్యార్థులు కూడా నెలకు సగటున రూ.11,000 వరకు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. ఎలారా టెక్నాలజీస్‍కు చెందిన‌ ‘మకాన్‌.కామ్‌’ అనే రియల్టీ పోర్టల్‌ ఈ విషయాలు వెల్లడించింది. ప్రధాన నగరాల్లో అద్దె ఇళ్ల కోసం చూస్తున్న వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు ఉన్నారు. అద్దె ఇళ్ల కోసం […]

16,000 అద్దె చెల్లించేందుకు రెడీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 12, 2019 | 2:38 PM

ఇంటి అద్దెలు బాగా పెరిగిపోతున్నా కూడా మెట్రో నగరాల్లో అద్దె ఇళ్లకు ఫుల్ డిమాండ్ ఉంది. నెలకు సగటున రూ.16,000 వరకు చెల్లించేందుకు ఉద్యోగులు రెడీ అవుతున్నారు. మరోవైపు విద్యార్థులు కూడా నెలకు సగటున రూ.11,000 వరకు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. ఎలారా టెక్నాలజీస్‍కు చెందిన‌ ‘మకాన్‌.కామ్‌’ అనే రియల్టీ పోర్టల్‌ ఈ విషయాలు వెల్లడించింది.

ప్రధాన నగరాల్లో అద్దె ఇళ్ల కోసం చూస్తున్న వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు ఉన్నారు. అద్దె ఇళ్ల కోసం వెతుకుతున్న వారిలో దాదాపు 69 శాతం మంది ఉద్యోగులు, 16 శాతం మంది స్వయం ఉపాధి రంగంలోని వారు, 15 శాతం మంది విద్యార్థులు ఉన్నారు. ఉద్యోగుల్లో 40 శాతం మంది నెలకు రూ.10,000 లేదా అంత కన్నా తక్కువ అద్దె ఉన్న ఇళ్ల కోసం చూస్తున్నారు. మరో 40 శాతం మంది మాత్రం తమకు నచ్చిన ఇల్లు దొరికితే రూ.10,000 నుంచి రూ.25,000 వరకు అద్దె చెల్లించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.