భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం.. లక్ష్యాన్ని చేధించిన ‘పినాక’ రాకెట్లు

దేశరక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) మరోసారి తన సత్తా చాటింది. భూతల పోరాటంలో సైన్యానికి వెన్నుదన్నుగా నిలిచే పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ నుంచి మరో అధునాతన రాకెట్లను విజయవంతంగా ప్రయోగించింది. రాజస్థాన్ లోని పోఖ్రాన్ రేంజ్ లో సోమవారం జరిగిన ఈ పరీక్షలో 90 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను పినాక రాకెట్లు గురితప్పకుండా ఛేదించాయి. గతంలో వీటి లక్ష్యం 70 కిలోమీటర్లుగా ఉండేవి. […]

భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం.. లక్ష్యాన్ని చేధించిన 'పినాక' రాకెట్లు
Follow us

| Edited By:

Updated on: Mar 12, 2019 | 11:32 AM

దేశరక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) మరోసారి తన సత్తా చాటింది. భూతల పోరాటంలో సైన్యానికి వెన్నుదన్నుగా నిలిచే పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ నుంచి మరో అధునాతన రాకెట్లను విజయవంతంగా ప్రయోగించింది. రాజస్థాన్ లోని పోఖ్రాన్ రేంజ్ లో సోమవారం జరిగిన ఈ పరీక్షలో 90 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను పినాక రాకెట్లు గురితప్పకుండా ఛేదించాయి. గతంలో వీటి లక్ష్యం 70 కిలోమీటర్లుగా ఉండేవి. తాజాగా 90 కిలో మీటర్ల లక్ష్యాన్ని కూడా చేధించడంతో.. భారత అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరినట్లైంది.

డీఆర్డీఓ నిర్వహించిన రెండు ప్రయోగాలు కూడా సంతృప్తికర ఫలితాలను ఇవ్వడంతో భారత రక్షణ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. అభివృద్ధి పరిచిన పినాక రాకెట్లలో గైడెడ్ టెక్నాలజీ అమర్చారు. తాజా పరీక్షల్లో ఈ వ్యవస్థను టట్రా ట్రక్కుపై ఉంచి ప్రయోగించారు. పినాక రాకెట్ లాంచర్ సరికొత్త వెర్షన్ కేవలం 44 సెకన్లలో 12 రాకెట్లను సంధించగలదు. కార్గిల్ యుద్ధ సమయంలో పర్వతాల చాటున దాగిన శత్రువులపై దాడికి భారత సైన్యం పినాక రాకెట్లను ఎక్కువగా ఉపయోగించింది.