ఒడిశాకి కేంద్రం వెయ్యి కోట్ల సహాయం..
ఒడిశాలో తుఫాన్ సహాయక చర్యల్లో నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. భారత నావికాదళానికి చెందిన హెలికాఫ్టర్లతో అధికారులు ఏరియల్ సర్వే నిర్వహించారు. ఫొని తుఫాన్‌తో ఎక్కడ ఎక్కువ నష్టం జరిగిందన్న విషయంపై అంచనా వేస్తున్నారు అధికారులు. ఒడిశాలోని 11 జిల్లాల్లో తుఫాన్ ప్రభావం కారణంగా నష్టం జరిగినట్టు గుర్తించారు. మారుమూల ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయడానికి హెలికాఫ్టర్లను ఉపయెగిస్తున్నారు. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పూరీలో అపార నష్టం జరిగిందని అధికారులు వెల్లడించారు. […]
ఒడిశాలో తుఫాన్ సహాయక చర్యల్లో నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. భారత నావికాదళానికి చెందిన హెలికాఫ్టర్లతో అధికారులు ఏరియల్ సర్వే నిర్వహించారు. ఫొని తుఫాన్‌తో ఎక్కడ ఎక్కువ నష్టం జరిగిందన్న విషయంపై అంచనా వేస్తున్నారు అధికారులు.
ఒడిశాలోని 11 జిల్లాల్లో తుఫాన్ ప్రభావం కారణంగా నష్టం జరిగినట్టు గుర్తించారు. మారుమూల ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయడానికి హెలికాఫ్టర్లను ఉపయెగిస్తున్నారు. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పూరీలో అపార నష్టం జరిగిందని అధికారులు వెల్లడించారు.
ఒడిశా తీర ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. తుఫాన్ బలహీనపడినప్పటికీ ఇంకా రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని అలర్ట్ జారీ చేశారు. తుఫానుతో జరిగిన నష్టంపై కేంద్రానికి వెంటనే నివేదిక పంపాలని సీఎం నవీన్ పట్నాయక్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఒడిశాకు ఇప్పటికే కేంద్రం రూ.1000 కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించింది. అవసరమైతే మరిన్ని నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది.