ఫొని తుఫాన్ లైవ్‌ అప్‌డేట్స్ : 223 రైళ్లు రద్దు.. 30 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం..

అతి తీవ్ర తుఫానుగా మారిన ఫొని తీరం వైపు విరుచుకు పడేందుకు సిద్ధమవతోంది. ఇవాళ సాయంత్రం కానీ.. అర్థరాత్రి కానీ తీరం దాటి బీభత్సం సృష్టించేందుకు దూసుకొస్తోంది. గంటలకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదముంది. ఒడిశాలోని గోపాల్ పూర్ – చాంద్‌బలి మధ్య తీరం దాటే ఛాన్స్ ఉంది. 500 కిలోమీటర్ల విస్తీర్ణంతో పూరీకి 361 కిలోమీటర్లు, విశాఖకు 191 కిలీమీటర్లు దూరంలో ఫొని కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. భారీ తుఫాను నేపథ్యంలో […]

ఫొని తుఫాన్ లైవ్‌ అప్‌డేట్స్ : 223 రైళ్లు రద్దు.. 30 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం..
Follow us

| Edited By:

Updated on: May 02, 2019 | 8:48 PM

అతి తీవ్ర తుఫానుగా మారిన ఫొని తీరం వైపు విరుచుకు పడేందుకు సిద్ధమవతోంది. ఇవాళ సాయంత్రం కానీ.. అర్థరాత్రి కానీ తీరం దాటి బీభత్సం సృష్టించేందుకు దూసుకొస్తోంది. గంటలకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదముంది. ఒడిశాలోని గోపాల్ పూర్ – చాంద్‌బలి మధ్య తీరం దాటే ఛాన్స్ ఉంది.

500 కిలోమీటర్ల విస్తీర్ణంతో పూరీకి 361 కిలోమీటర్లు, విశాఖకు 191 కిలీమీటర్లు దూరంలో ఫొని కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. భారీ తుఫాను నేపథ్యంలో ఒడిశాలో హై అలర్ట్ ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్‌ను రంగంలోకి దింపారు. టూరిస్టులందరూ పూరీని విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు అక్కడి అధికారులు. ఇక గంటకు 22 కిలోమీటర్ల వేగంతో కదులుతోన్న తుఫాన్ దిశ మార్చుకుని పయనించే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

దీంతో.. ఇవాళ, రేపు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అతి భారీ వర్షాలు, విశాఖలో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో.. 103 రైళ్లను కూడా రద్దు చేసింది రైల్వేశాఖ. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా సోంపేట బారువ తీర ప్రాంతం నుంచి ఎర్రముక్కం వరకు అలల ఉధృతి పెరిగింది. తీరంలో 15 నుంచి 25 మీటర్లు వరకు ముందుకొచ్చిన సముద్రం.