ఆంధ్రప్రదేశ్ లో 71,821 హెక్టార్ల పంట నష్టం

గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలో వర్షాలు, అనంతర పరిస్థితులను అధికారులు నివేదికలు తయారు చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో 71,821 హెక్టార్ల పంట నష్టం
Follow us
Balaraju Goud

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 14, 2020 | 9:53 PM

గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలో వర్షాలు, అనంతర పరిస్థితులను అధికారులు నివేదికలు తయారు చేశారు. వర్షప్రభావిత ప్రాంతాలు, నెలకొన్న పరిస్థితులను, పంటనష్టం, ప్రాథమిక అంచనాలను ఏపీ వ్యవసాయశాఖ రూపొందించింది. ఉభయ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల్లో భారీగా పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 9 జిల్లాల్లో 24 రకాల పంటలకు నష్టం వాటిల్లినట్లు తేల్చారు.

ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, మిరప, మినుము పంటలకు భారీగా నష్టం జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవశాఖ అధికారులు పేర్కొంది. భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 71,821 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. మొత్తం 54,694 హెక్టార్లలో వరిపంట మునిగినట్లు అంచనాలు తయారు చేసింది. 12,047 హెక్టార్లలో పత్తి, 1,600 హెక్టార్లలో మినుము, 310 హెక్టార్లలో చెరకు పంటలు ముంపునకు గురైనట్లు వ్యవసాయశాఖ అంచనాలు రూపొందిచింది.