Crime News: దారుణం: కన్నబిడ్డనే కడతేర్చిన కసాయి తల్లి…
నల్గొండలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కన్నబిడ్డనే ఓ కసాయి తల్లి కడతేర్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. నల్గొండ మండల పరిధిలోని బుద్దారం గ్రామంలో..
Crime News Nalgonda: నల్గొండలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కన్నబిడ్డనే ఓ కసాయి తల్లి కడతేర్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. నల్గొండ మండల పరిధిలోని బుద్దారం గ్రామంలో విజయ అనే మహిళ తన కొడుకు నాగరాజు(9)ను అత్యంత దారుణంగా హత్య చేసింది. బాలుడి మెడకు టవల్ చుట్టి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీయడమే కాకుండా గోనె సంచిలో అతడి శవాన్ని మూట కట్టింది. స్థానికుల సమాచారం ప్రకారం పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా.. ఆ మహిళ అక్రమ సంబంధానికి ఈ పిల్లాడు అడ్డుగా ఉండటం వల్లే హత్య చేసి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: సామాన్యుడి ట్వీట్‌తో.. పోలీస్ వాహనానికే..