COVID Vaccine: కరోనా వ్యాక్సిన్‌ సంబరాలు చూశారా… డప్పు చప్పులతో, బాణాసంచా కాలుస్తూ, ర్యాలీగా…

COVID Vaccine Celebrations: దాదాపు ఏడాదిపాటు యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిని అంతమొందించే క్రమంలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది..

COVID Vaccine: కరోనా వ్యాక్సిన్‌ సంబరాలు చూశారా... డప్పు చప్పులతో, బాణాసంచా కాలుస్తూ, ర్యాలీగా...
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 17, 2021 | 5:45 AM

COVID Vaccine Celebrations: దాదాపు ఏడాదిపాటు యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిని అంతమొందించే క్రమంలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ శనివారం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ఒక పండగలా ప్రారంభమైంది. దేశంలోని ఒక్కో చోట ఒక్కోలా ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొన్ని చోట్ల నర్సులు స్వీట్లు పంచుకుంటూ ఆనందాల నడుమ వ్యాక్సినేషన్‌ను మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే చత్తీస్‌ ఘడ్‌కు చెందిన కొందరు ఈ వ్యాక్సినేషన్‌ను మరింత జోష్‌తో ప్రారంభించారు. కరోనా మహమ్మారిని అంతమొందించే వ్యాక్సిన్‌ వచ్చిందంటూ అంగరంగ వైభవంగా టీకాకు స్వాగతం పలికారు. కరోనా వ్యాక్సిన్‌ తీసుకొచ్చే వాహనం ముందు డప్పు చప్పుళ్లతో జనాలు సందడి చేశారు. బాణా సంచి కాల్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. మరి వ్యాక్సిన్‌ వచ్చిందన్న ఆనందంలో చత్తీస్‌ఘడ్‌ ప్రజలు చేసిన హంగామాను మీరు కూడా చూడండి.

Also Read: తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్‌ విజయవంతం.. తొలి రోజు 3,530 మందికి టీకా అందించామన్న హెల్త్‌ డైరెక్టర్