బీహార్ ఎన్నికలను ఆపలేం : సుప్రీంకోర్టు
కరోనా వైరస్ కారణం చేత బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ఆపలేమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఎన్నికలను రద్దు చేసే విధంగా ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ సుప్రీం స్పందించింది
కరోనా వైరస్ కారణం చేత బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ఆపలేమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఎన్నికలను రద్దు చేసే విధంగా ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ సుప్రీం స్పందించింది. దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు కూడా చకచక జరిగిపోతున్నాయి. ఈ సమయంలో ఎన్నికలను ఆపాలంటూ కొందరు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కోవిడ్ నెపంతో ఎన్నికలను అడ్డుకోలేమని, ఎలక్షన్ కమిషన్ అధికారాలను ప్రశ్నించలేమని సుప్రీం తీర్పు వెలువరించింది. బీహార్ ఎన్నికలకు సంబంధించి ఇంత వరకు నోటిఫికేషన్ కూడా రాలేదని పేర్కొంది. సీఈసీకి తామేమీ ఆదేశాలు ఇవ్వలేమని, కమిషనర్ అన్నీ పరిగణలోకి తీసుకుంటారని కోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాలేదని, అందుకే పిటిషన్‌కు అర్హత లేదని, ఎన్నికలు నిర్వహించవద్దు అని ఈసీని ఎలా ఆదేశిస్తామని కోర్టు చెప్పింది. ఎన్నికల వాయిదాకు కోవిడ్ అనేది సరైన కారణం కాదు అని తెలిపింది. ఈ ఏడాది నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలను రద్దు చేయాలని అవినాశ్ థాకూర్ సుప్రీంలో పిటిషన్ దాఖలు వేశారు.