కరోనాపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
బెంగళూరులో వైరస్ పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుది. కరోనా ప్రభావిత ప్రాంతాలను గుర్తించి మరోసారి కంటెన్మెంట్ చేయాలని నిర్ణయించింది.

కర్ణాటకలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రాజధాని నగరం బెంగళూరులో వైరస్ పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుది. కరోనా ప్రభావిత ప్రాంతాలను గుర్తించి మరోసారి కంటెన్మెంట్ చేయాలని నిర్ణయించింది. ఒక్క ఆదివారం రోజునే రాష్ట్ర వ్యాప్తంగా 1200కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 64 మంది వైరస్ బాధితులు మృతి చెందారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప సోమవారం ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి జన సంచారంపై అంక్షలు విధించాలని ఆదేశించారు సీఎం యడియూరప్ప. అవసరమైతే సరిహద్దులను మూసివేయాలన్నారు. కరోనా పరీక్షల సామర్థ్యం పెంచి లక్షణాలు కనిపించిన ప్రతీ ఒక్కరిని టెస్ట్ చేయాలని స్పష్టం చేశారు. తాజాగా బెంగళూరు నగరంలోనే 298 కంటైన్‌మెంట్ జోన్లను గుర్తించామని స్థానిక అధికారులు వెల్లడించారు. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు 518 ప్రైవేటు ఆస్పత్రులను సిద్ధం చేసినట్లు తెలిపారు.




