Covid 19 Effect: కరోనా ఎఫెక్ట్.. చైనాకు మన వైద్య పరికరాల ఎగుమతిలో ‘కోత’

కరోనా ఔట్ బ్రేక్ కారణంగా చైనాకు కొన్ని వైద్య  పరికరాల ఎగుమతిపై భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దేశంలో వీటి కొరత ఏర్పడిన కారణంగాను, ఈ వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన అడ్వైజరీ దృష్ట్యాను ఇలా కొన్ని  ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు విదేశాంగ శాఖ

Covid 19 Effect: కరోనా ఎఫెక్ట్.. చైనాకు మన వైద్య పరికరాల ఎగుమతిలో 'కోత'
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 24, 2020 | 12:50 PM

Covid 19 Effect:కరోనా ఔట్ బ్రేక్ కారణంగా చైనాకు కొన్ని వైద్య  పరికరాల ఎగుమతిపై భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దేశంలో వీటి కొరత ఏర్పడిన కారణంగాను, ఈ వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన అడ్వైజరీ దృష్ట్యాను ఇలా కొన్ని  ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. తమ దేశంలో కరోనా వ్యాప్తి వల్ల కొన్ని వైద్య పరికరాల ఎగుమతి మీద ఇండియా ఆంక్షలు విధించడంపట్ల చైనా ఎంబసీ ప్రతినిధి ఒకరు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే ఈ నిర్ణయం తీసుకున్నంత మాత్రాన.. చైనా దీనిపై సానుకూల వైఖరి ప్రదర్శించాలని, భారత, చైనా దేశాల మధ్య  సాధారణ వాణిజ్య సంబంధాలు దెబ్బ తినరాదని తాము భావిస్తున్నామని రవీష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సంబంధాలు యధావిధిగా కొనసాగుతాయని ఆశిస్తున్నామన్నారు. మా దేశంలోనూ కోట్లాది జనాభా ఉన్నారు.. అందువల్ల కరోనా నివారణకు అవసరమైన చర్యలను  మేం తీసుకోవలసి ఉంది అన్నారాయన. నిజానికి ఈ ఆపద సమయంలో మీకు అండగా ఉంటామని ప్రధాని మోదీ ఈ నెలారంభంలోనే చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కు లేఖ  రాసిన విషయాన్ని  రవీష్ కుమార్ గుర్తు చేశారు.

వైద్య పరికరాలతో బాటు వైద్య సంబంధ సాయాన్నిఓ ప్రత్యేక విమానంలో చైనాకు పంపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని చెప్పిన ఆయన.. ఈ విమానం మీ దేశంలో దిగేందుకు అనుమతించాలని ఆ దేశ అధికారులను కోరుతున్నామన్నారు. అదే విమానంలో ముఖ్యంగా వూహాన్ సిటీలో ఇంకా ఉన్న భారతీయులను స్వదేశానికి పంపేందుకు చైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా రవీష్ కుమార్ అభ్యర్థించారు.