AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: చంద్రబాబు మెడకు మరో కేసు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మెడకు మరో కేసు బిగుసుకుంది. సుప్రీంకోర్టులో ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలైంది. దాన్ని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించింది..

Breaking News: చంద్రబాబు మెడకు మరో కేసు
Rajesh Sharma
|

Updated on: Feb 24, 2020 | 12:51 PM

Share

Petition filed against Chandrababu on State capital issue: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మెడకు మరో కేసు బిగుసుకుంది. అయితే ఈసారి ఆయన జమానాలో జరిగిన తంతు గురించో.. లేక ఆయన ఆస్తుల గురించో కాదు.. ఏపీ క్యాపిటల్ విషయంలో నిబంధనలకు, ఆదేశాలు, చట్టాలను కాదని తప్పుడు నిర్ణయం తీసుకున్నారంటూ చంద్రబాబుపై సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ అయ్యింది.

2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ క్యాపిటల్‌ని ఎక్కడ పెట్టాలనే విషయంలో చంద్రబాబు నిబంధనలను తుంగలో తొక్కారన్నది ఈ పిటిషన్ సారాంశం. ఏపీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అనిల్ కుమార్ బోరుగడ్డ ఈ పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.

చంద్రబాబు గతంలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలను, రాజధాని ఏర్పాటుపై నియమించిన శివ రామ కృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి సొంత లాభం కోసం రాజధాని ని విజయవాడ, గుంటూరుకు రాజధానిని తరలించారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనిల్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ రోహింగ్టన్ నారిమాన్, జస్టిస్ రవీంద్ర భట్ విచారణకు స్వీకరించారు.

పిటిషనర్ తరపు న్యాయవాది ప్రజెంటేషన్ ఆసాంతం విన్న సుప్రీం న్యాయమూర్తులిద్దరు.. ఈ అంశంపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాలని సూచించారు. ఈ మేరకు హైకోర్టుకు కేసును డైరెక్టు చేశారు.

Read this: Chandrababu focused on two assembly constituencies. Why? రెండు నియోజకవర్గాలపై బాబు నజర్

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి 2026 ఫలితాల తేదీలు చూశారా?
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి 2026 ఫలితాల తేదీలు చూశారా?
షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న మందుల ధరలు.. ఏయే టాబ్లెట్స్‌ అంటే..!
షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న మందుల ధరలు.. ఏయే టాబ్లెట్స్‌ అంటే..!
Shukra Gochar: ఈ రాశులకు చెందిన మహిళలకు లక్ష్మీ కటాక్షం..!
Shukra Gochar: ఈ రాశులకు చెందిన మహిళలకు లక్ష్మీ కటాక్షం..!
బయటకెళ్దామని బండి తీశాడు.. తాళం ఆన్ చేస్తుండగా కనిపించింది చూసి..
బయటకెళ్దామని బండి తీశాడు.. తాళం ఆన్ చేస్తుండగా కనిపించింది చూసి..
సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..
సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..
అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరితో ఆకలి తీర్చుకుంది
అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరితో ఆకలి తీర్చుకుంది
బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం
బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే
ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!
ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!
కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం
కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం