Trump visit: ట్రంప్ ప్రయాణించే కారు.. బీస్ట్ గురించి వింటే.. షాకవ్వాల్సిందే..!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశానికి చేరుకున్నారు. ట్రంప్ దంపతులకు ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా స్వాగతం పలికారు. ఆ దేశ అధ్యక్షుడి భద్రత విషయంలో అమెరికా మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. అందుకు నిదర్శనం

Trump visit: ట్రంప్ ప్రయాణించే కారు.. బీస్ట్ గురించి వింటే.. షాకవ్వాల్సిందే..!
Follow us

| Edited By:

Updated on: Feb 24, 2020 | 1:37 PM

Trump visit: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశానికి చేరుకున్నారు. ట్రంప్ దంపతులకు ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా స్వాగతం పలికారు. ఆ దేశ అధ్యక్షుడి భద్రత విషయంలో అమెరికా మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. అందుకు నిదర్శనం యూఎస్ ప్రెసిడెంట్ ప్రయాణించే కారు.. ద బీస్ట్.. ప్రత్యేకత గురించే చెప్పుకోవాలి. దీని టెక్నాలజీ హైరేంజ్ ఉంటుంది. దీని భద్రత మోస్ట్ హై రేంజ్ లో ఉంటుంది. ఈ కారు డోర్స్ మందం 8 అంగుళాలు ఉంటుంది. శక్తివంతమైన బాంబు దాడులను సైతం ఇది తట్టుకుంటుంది. శత్రుదుర్బేధ్యమైన బీస్ట్ కారును బుల్లెట్ ప్రూఫ్ టెక్నాలజీ గ్లాస్‌తో ఈ కారును డిజైన్ చేశారు.

బీస్ట్ ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన, సురక్షితమైన కారు. దీన్ని కాడిలాక్ వన్, ఫస్ట్ కార్ అని కూడా పిలుస్తుంటారు. అమెరికా కేంద్ర నిఘా సంస్థ సీఐఏ ఎంపిక చేసిన సీక్రెట్ ఏజెంట్ మాత్రమే ఈ కారు డ్రైవర్ గా వ్యవహరిస్తారు. మిగిలిన వారికి ఈ కారును కనీసం ముట్టుకునేందుకు కూడా అవకాశం ఉండదు. శక్తివంతమైన బాంబులు బీస్ట్ కు సమీపంలోనే పేలినా లోపల ఉన్న ప్రెసిడెంట్ వెంట్రుక కూడా కదలదు. ఈ బీస్ట్ మరో ప్రత్యేకత ఏంటంటే.. రసాయన ఆయుధ దాడిని కూడా తట్టుకోగల సామర్ధ్యం దీని సొంతం. ఈ కారును జనరల్ మోటార్స్ సంస్థ తయారు చేసింది. ఇలాంటివి మొత్తం 12 కార్లు ట్రంప్ కాన్వాయ్ లో ఉంటాయి.

అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా బీస్ట్ కూడా అక్కడ అడుగుపెట్టాల్సిందే. ఈ కారు ఖరీదు అక్షరాల వంద కోట్ల రూపాయలు. కారు బరువు 8 టన్నులు ఉంటుంది. కారు అద్దాల మందం ఐదు అంగుళాలు ఉంటుంది. కారు అడుగు భాగాన బాంబు పేలినా కారుకు గానీ, ఇంధన ట్యాంకుకు గానీ ఎలాంటి నష్టం కలుగదు. కనీసం కారులో కుదపు కలిగినట్టు కూడా తెలియదు. క్లిష్ట పరిస్థితుల్లో దాడి చేయాలనుకుంటే.. డ్రైవర్‌కు సీటు పక్కన, అటు డోర్ వద్ద ప్రయోగించడానికి అనువుగా అత్యాధునిక ఆయుధాలు సిద్ధంగా ఉంటాయి. బీస్ట్ కారు ముందుభాగంలో బంపర్ల వద్ద టియర్ గ్యాస్ గ్రెనేడ్ లాంచర్లు ఉంటాయి.