Covid Vaccine: వ్యాక్సిన్‌తోనే కరోనాకు చెక్ అంటున్న నిపుణులు.. దేశవ్యాప్తంగా పెరుగుతున్న రిజిస్ట్రేషన్లు.. ఎంతమందికి టీకా అందిందంటే..?

దేశంలో టీకా కోసం కోట్లాది మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. ఇదే ఇప్పుడు టీవీ9 నినాదం.. దేశం విధానం కూడా.

Covid Vaccine: వ్యాక్సిన్‌తోనే కరోనాకు చెక్ అంటున్న నిపుణులు.. దేశవ్యాప్తంగా పెరుగుతున్న రిజిస్ట్రేషన్లు.. ఎంతమందికి టీకా అందిందంటే..?
Covid Vaccine
Follow us
Balaraju Goud

|

Updated on: May 19, 2021 | 7:03 PM

Coronavirus Vaccine Drive: కరోనా నుంచి విముక్తి కలగాలంటే.. టీకా ఒక్కటే పరిష్కారం. ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. దేశంలో టీకా కోసం కోట్లాది మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. ఇదే ఇప్పుడు టీవీ9 నినాదం.. దేశం విధానం కూడా. కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దేశంలో ప్రతీ ఒక్కరికి వ్యాక్సినేషన్ అందాలంటోంది టీవీ9.

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 18 కోట్ల 55 లక్షల 12 వేల 227 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. అందులో 14 కోట్ల 45 లక్షల 48 వేల 513 మందికి మొదటి డోస్‌ అందగా.. 4 కోట్ల 9 లక్షల 63 వేల 714 మందికి రెండోవ డోస్‌ కూడా పూర్తైంది. ఇవాళ ఇప్పటి వరకు 4 లక్షా 5 వేల 594 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది.

Covid Vaccine

Covid Vaccine

ఇటు, తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలో ఇప్పటి వరకు 78 లక్షల 12 వేల 480 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. 55 లక్షల 21 వేల 130 మందికి మొదటి డోస్‌ తీసుకోగా.. 22 లక్షల 91 వేల 350 మందికి రెండో డోస్‌ కూడా పూర్తైంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 55 లక్షల 17 వేల 294 మందికి వ్యాక్సినేషన్ అందింది. అందులో మొదటి డేస్ పూర్తైన వారు 44 లక్షల 51 వేల 454 మంది. రెండో డోస్‌ పూర్తైన వారు 10 లక్షల 65 వేల 840 మంది. ఇదిలావుంటే, తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత కారణంగా మొదటి డోస్‌ వ్యాక్సిన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొంత నెమ్మదించింది. ఇవి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌తో పాటు..

ఇక దేశ వ్యాప్తంగా రెండు కంపెనీల వ్యాక్సిన్లు మనకు అందుతున్నాయి. అందులో ఏ కంపెనీ నుంచి ఎన్ని వ్యాక్సినేషన్లు పూర్తయ్యాయి అనే వివరాలు చూస్తే.. 16 కోట్ల 60 లక్షల 34 వేల 171 డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ అందగా.. కోటి 94 లక్షల 77 వేల 885 మందికి కోవాగ్జిన్ డోసులు అందాయి.

ఇక ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలు చూస్తే.. 22 కోట్ల 9 లక్షల 19 వేల 28 మంది వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 8 కోట్ల 12 లక్షల 84 వేల 271 మంది 18 నుంచి 44 ఏళ్ల మధ్య గ్రూప్ వారు అయితే.. 13 కోట్ల 96 లక్షల 34 వేల 757 మంది 45 ఏళ్ల పై బడిన వారు.

కాగా, అందరికి వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. టీవీ9 నినాదం.. దేశం విధానం. మరి వ్యాక్సిన్ కోసం మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా? లేదంటే.. ఇప్పుడు కోవిన్ పోర్టల్‌ను ఓపెన్ చేయండి… అందరూ వ్యాక్సిన్ వేసుకోండి.. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండీ..! భౌతిక దూరం పాటించండి.. కరోనాను దరి చేయనివ్వకండి…

Covid Vaccine

Covid Vaccine

Read Also… Covid Vaccine Guidelines: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. గర్బిణిలు, కోవిడ్‌తో కోలుకున్నవారు టీకా ఎప్పుడు తీసుకోవాలంటే..!