AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇకపై ప్రైవేట్ ల్యాబ్స్‌ల్లోనూ కరోనా పరీక్షలు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

Coronavirus: తెలుగు రాష్ట్రాలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. ఇప్పటికే తెలంగాణలో 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేటు ల్యాబ్స్‌లలోనూ కరోనా పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి ల్యాబోరేటరీ సర్వీసెస్, హిమాయత్ నగర్‌లోని విజయ డయాగ్నస్టిక్ సెంటర్, చర్లపల్లిలోని విమ్టా ల్యాబ్స్, బోయిన్‌పల్లిలోని అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్, శేరిలింగంపల్లిలోని అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ అండ్ ల్యాబ్ […]

ఇకపై ప్రైవేట్ ల్యాబ్స్‌ల్లోనూ కరోనా పరీక్షలు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
Ravi Kiran
|

Updated on: Mar 30, 2020 | 9:08 AM

Share

Coronavirus: తెలుగు రాష్ట్రాలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. ఇప్పటికే తెలంగాణలో 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేటు ల్యాబ్స్‌లలోనూ కరోనా పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి ల్యాబోరేటరీ సర్వీసెస్, హిమాయత్ నగర్‌లోని విజయ డయాగ్నస్టిక్ సెంటర్, చర్లపల్లిలోని విమ్టా ల్యాబ్స్, బోయిన్‌పల్లిలోని అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్, శేరిలింగంపల్లిలోని అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ అండ్ ల్యాబ్ సర్వీసెస్, న్యూబోయిన్‌పల్లిలోని మెడిసిన్ పాథ్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పంజగుట్టలోని డాక్టర్ రెమెడీస్ ల్యాబ్స్, మేడ్చల్ లోని పాథ్ కేర్ ల్యాబ్స్‌లలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

అటు సోమాజిగూడ, సికింద్రాబాద్, మలక్‌పేట్‌లోని యశోద ఆసుపత్రుల్లోనూ కరోనా వైరస్ బాధితులకు అవసరమైన క్వారంటైన్‌లను ఏర్పాటు చేశారు. కాగా, రాష్ట్రంలో 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒకరు మృతి చెందగా.. ఆదివారం 11 మందికి వ్యాధి నుంచి కోలుకోగా.. మరో 58 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా నియంత్రణకు ప్రజలందరూ కూడా సామాజిక దూరాన్ని పాటించాలని మరోసారి సీఎం కేసిఆర్ విజ్ఞప్తి చేశారు.

ఇది చదవండి: గుడ్ న్యూస్.. ఏపీలో కోలుకున్న మరో కరోనా బాధితుడు..

Follow Us
నెలకు రూ.10,000 పెట్టుబడి.. 10 ఏళ్లలో రూ. 34 లక్షల లాభం..
నెలకు రూ.10,000 పెట్టుబడి.. 10 ఏళ్లలో రూ. 34 లక్షల లాభం..
ఇది చెంచాడు ఇస్తే చాలు.. మల్లెమొక్క గుత్తులు గుత్తులుగా..
ఇది చెంచాడు ఇస్తే చాలు.. మల్లెమొక్క గుత్తులు గుత్తులుగా..
NDAకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు- ప్రధాని మోదీ
NDAకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు- ప్రధాని మోదీ
ఉప్పు కొనుగోలుపై వాస్తు ఏమంటుంది? నిజం vs నమ్మకం
ఉప్పు కొనుగోలుపై వాస్తు ఏమంటుంది? నిజం vs నమ్మకం
మే నెలలో ముంచెత్తనున్న వానలు.. వాతావరణ శాఖ సంచలన ప్రకటన
మే నెలలో ముంచెత్తనున్న వానలు.. వాతావరణ శాఖ సంచలన ప్రకటన
అందరికంటే ముందే మేం ఇంటికిపోతున్నాం.. మా పాలిట విలన్స్ ఆ ఇద్దరే.!
అందరికంటే ముందే మేం ఇంటికిపోతున్నాం.. మా పాలిట విలన్స్ ఆ ఇద్దరే.!
విజయ్ చెల్లి ఎలా చనిపోయిందో తెలుసా? పాపం చిన్న వయసులోనే ఆ సమస్యతో
విజయ్ చెల్లి ఎలా చనిపోయిందో తెలుసా? పాపం చిన్న వయసులోనే ఆ సమస్యతో
రూ.4,20,000 జీతంతో హైదరాబాద్‌ ప్రసార్ భారతిలో ఉద్యోగాలు..
రూ.4,20,000 జీతంతో హైదరాబాద్‌ ప్రసార్ భారతిలో ఉద్యోగాలు..
Bank Jobs Alert: యూనియన్ బ్యాంక్‌లో 1865 ఖాళీలు.. అప్లై చేయండి..
Bank Jobs Alert: యూనియన్ బ్యాంక్‌లో 1865 ఖాళీలు.. అప్లై చేయండి..
7-సీటర్ కార్లలో సంచలనం.. టర్బో ఇంజిన్, డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ
7-సీటర్ కార్లలో సంచలనం.. టర్బో ఇంజిన్, డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ